More Prone to the Evil Eye: జ్యోతిష్య శాస్త్రంలో నజర్ లేదా దిష్టికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి సాధించిన విజయం, అందం, తెలివితేటలు, ఎదుగుదల లేదా సంపదను చూసి ఇతరుల్లో కలిగే ఈర్ష్య, అసూయ, నకారాత్మక శక్తులు ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని రాశుల వారి వ్యక్తిత్వం మరియు ఆకర్షణ వల్ల ఇతరుల దిష్టి వీరికి త్వరగా తగిలే అవకాశం ఉంటుంది. ఆ 5 రాశులు ఏవో, దానికి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మేష రాశి – వేగవంతమైన ఎదుగుదల

మేష రాశి వారు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో ముందుకెళ్తారు. వీరు ఏ పని తలపెట్టినా చాలా వేగంగా విజయం సాధిస్తారు. వీరి వేగవంతమైన ఎదుగుదల ఇతరుల దృష్టిని త్వరగా ఆకర్షిస్తుంది. ఫలితంగా ఇతరుల అసూయ లేదా దిష్టి వల్ల వీరి జీవితంలో అనుకోకుండా అడ్డంకులు, అనవసర మానసిక ఒత్తిడి కలగవచ్చు.

సింహ రాశి– రాజసం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం

సింహ రాశి వారు సహజంగానే బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటారు. వీరు సాధించే విజయాలు, వీరి రాజసం ఇతరుల్లో పోటీతత్వాన్ని లేదా ఈర్ష్యను పెంచుతాయి. అందుకే వీరు ఎంత ఎదిగినా ఒడుదుడుకులు రాకుండా ఉండటానికి ఒద్దికగా ఉండటం, విజయాన్ని ఆర్భాటం చేయకపోవడం మంచిది.

తులా రాశి – ఆకట్టుకునే మాటతీరు, అందం

తులా రాశి వారు మృదువైన మాటతీరు, అందమైన ప్రవర్తనతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. సమాజంలో వీరికి ఉండే సంబంధాలు, బ్యాలెన్స్‌డ్ లైఫ్‌స్టైల్ ఇతరులను విశేషంగా ఆకర్షిస్తాయి. వీరి ప్రశాంతత మరియు ప్రజాదరణ ఇతరులలో అసూయను ప్రేరేపిస్తాయి. దీనివల్ల వీరి మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక మార్గం మరియు ధ్యానం వీరికి రక్షణగా నిలుస్తాయి.

వృశ్చిక రాశి– గంభీరమైన లోతైన ఆలోచనలు

వృశ్చిక రాశి వారు ఎంతో పట్టుదల, గంభీరమైన ఆలోచనలు కలిగినవారు. తమ లక్ష్యాలను ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా, ప్రశాంతంగా సాధిస్తారు.హ వీరి ఈ రహస్యమైన వ్యక్తిత్వం, సాధించే విజయాలు ఇతరులలో కుతూహలాన్ని, అసూయను ఒకేసారి కలిగిస్తాయి. అందుకే వీరు తమ భవిష్యత్తు ప్రణాళికలు లేదా విషయాలను అందరితో పంచుకోకపోవడమే మంచిది.

మీన రాశి

మీన రాశి వారు చాలా మృదువైన మనస్సు, దయాగుణం మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణం కలిగినవారు. వీరి అతి సున్నితమైన మనస్తత్వం వల్ల ఇతరుల నుండి వచ్చే నకారాత్మక శక్తి వీరిపై త్వరగా ప్రభావం చూపుతుంది. మనోధైర్యాన్ని పెంచుకోవడం, దైవచింతన ద్వారా వీరు దిష్టి ప్రభావాల నుండి బయటపడవచ్చు.

Tags: