Horoscope : ఈ వారం రాశి ఫలాలు

రాశిఫలాలు...03.08.25 నుండి 09.08.25 వరకు;

Update: 2025-08-02 09:32 GMT

పండగలు – పర్వదినాలు ...

––––––––––––––––––––––--------------

05, మంగళవారం, మతత్రయ ఏకాదశి

06, బుధవారం, దామోదర ద్వాదశి

08, శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం

09, శనివారం, శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ, జంధ్యాల పౌర్ణమి

–––––––––––––––––––––––––––––––


మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కొత్త విద్యాయత్నాలు సానుకూలమవుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సేవాభావంతో ముందుకు సాగి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ కార్యక్రమమైనా విజయవంతంగా కొనసాగుతుంది. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. రుణబాధలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. 8,9 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించాలి. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. లక్ష్మీనారాయణ స్తోత్రాలు పఠించండి.


వృషభం.... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసి ఊరట చెందుతారు. సోదరులు,స్నేహితులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల కలలు ఫలిస్తాయి. వాక్చాతుర్యంతో అందరి మెప్పు పొందుతారు. మీ మనస్సులోని ఉద్దేశాలను నిర్భయంగా వెల్లడిస్తారు. ప్రత్యర్థులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు« అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు ఊహించని కొన్ని పదవులు దక్కవచ్చు. 3,4 తేదీల్లో పనుల్లో అవరోధాలు. ఇంటాబయటా విమర్శలు పెరుగుతాయి. కొన్ని అపవాదులు కూడా భరించాల్సిన సమయం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయానికి పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. తరచూ ప్రయాణాలు సంభవం. కొన్ని నిర్ణయాలపై పునఃసమీక్షిస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు రావలసిన ప్రమోషన్లు పొందుతారు. కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు రావచ్చు. 6,7 తేదీల్లో శ్రమాధిక్యం తప్పదు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

నూతన కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులు కలిసి గతాన్ని నెమరువేసుకుంటారు. ఆదాయం ఆశించినంతగా లభించే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు బంధువుల చేయూత అందిస్తారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం అందుతుంది. వ్యాపారులు లాభాలు మరింత ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ, ప్రోత్సాహం అందుతాయి. 4,5 తేదీల్లో భూవివాదాలు నెలకొంటాయి. నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. వాహనాలు భద్రంగా చూసుకోండి. దేవీస్తోత్రాలు పఠించండి.


సింహం.... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

అదనపు రాబడితో అనుకున్న ఖర్చులు అధిగిస్తారు. స్నేహితులతో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. లక్ష్యాలు సాధనలో ముందుకు సాగుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడి లబ్ధి పొందుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. బంధువుల నుంచి∙ఆహ్వానాలు అంది సంతోషపడతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమయానికి అందుతాయి. విస్తరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. 3,4 తేదీల్లో ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులతో సమస్యలు ఎదురవుతాయి. హనుమాన్‌స్తోత్రాలు పఠించండి.


కన్య.... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. కొత్త కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దూరపు బంధువులు ఊహించని మాటసాయం అందిస్తారు. విద్యార్థుల కృషి, శ్రమ ఫలిస్తాయి. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 5,6 తేదీల్లో కుటుంబంలో చికాకులు. పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత నెమ్మదిస్తాయి. కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఓర్పుగా ఉన్నా మీపై విమర్శలు తప్పవు. అయితే శాంతం ముఖ్యం. కాంట్రాక్టర్లు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించండి. స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. వ్యాపారులు కొన్ని ఒడిదుడుకుల మధ్యే లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు ఎదురై సవాలుగా మారవచ్చు. కళాకారులకు అవకాశాలు తగ్గి నిరాశ చెందుతారు. 4,5 తేదీల్లో కుటుంబసభ్యుల చేయూతతో ముందుకు సాగుతారు. పనులు చకచకా సాగుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబాధల నుంచి బయటపడే సమయం. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే వరిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు సాగిస్తారు. నూతన వ్యక్తులు పరిచయమై చేయూతనిస్తారు. వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం లోటు ఉండదు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడులు తొలగుతాయి. మీపై అదనపు బాధ్యతలు ఉంచే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు సఫమవుతాయి. 7,8 తేదీల్లో మిత్రులతో అకారణ వైరం. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యుల సహకారం అంతగా ఉండదు. శివాష్టకం పఠించండి.


ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

కొత్త వ్యక్తులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. పనులు చకచకా సాగి మీ సమర్థత చాటుకుంటారు. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించినరీతిలో మార్పులు జరిగే సూచనలు. కళాకారులు ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి. 8,9 తేదీల్లో ఆర్థిక విషయాలు కొంత గందరగోళంగా ఉంటాయి. బంధువర్గంతో విరోధాలు ఏర్పడవచ్చు. శ్రమ పెరుగుతుంది. ముక్కు, గొంతు సంబంధిత రుగ్మతలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

అందరిలోనూ గౌరవమర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. విద్యార్థులకు ఫలితాలపై సంతృప్తి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బందిలేకుండా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు చేయూతనిస్తారు. వివాహయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు కలసివచ్చే అవకాశం. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులు మునుపటి కంటే లాభాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు వ్యూహాత్మకంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. 6,7 తేదీల్లో చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. అంగారక స్తోత్రాలు పఠించండి.


కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. శుభకార్యాలకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. పాతబాకీలు కొంతమేర వసూలై ఆర్థికంగా బలపడతారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. అవకాశాలు పెరుగుతాయి. 5,6 తేదీల్లో రుణయత్నాలు సాగిస్తారు. కుటుంబసభ్యులు, ఆప్తులతో వివాదాలు. పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సకాలంలో సమర్థనీయంగా పూర్తి చేస్తారు. రాబడి ఖర్చులకు దీటుగా లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు. పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడంలో సఫలమవుతారు. వాహన, గృహయోగాలు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు, వివాదాలు పరిష్కారం. సోదరులతో ముఖ్యమైన విషయాలపై సంభాషిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి పెడతారు. వ్యాపారులు అనుకున్న లాభాల వైపు అడుగులు వేస్తారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు పడిన శ్రమకు ఫలితం అందుకుంటారు. 8,9 తేదీల్లో వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రీ హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

––––––––––––––––––––––––

Tags:    

Similar News