Devotional: ఈ రోజే నిర్జలఏకాదశి... ఏం చేస్తే మంచిదంటే?
ఏం చేస్తే మంచిదంటే?;
Devotional: నిర్జల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం..
సంవత్సరంలోని 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఉపవాసంలో.. రోజంతా ఆహారం , నీరు లేకుండా ఉండవలసి ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికీ అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం పొందుతాడని చెబుతారు. దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం.
ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు?
వైదిక క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6న పాటించాల్సి ఉంటుంది.
నిర్జల ఏకాదశిలో పూజించే విధానం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి.
ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును పూజించండి.
ఇప్పుడు పసుపు చందనం, పసుపు పువ్వులను స్వామికి సమర్పించండి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండండి.