Horoscope for November 25, 2026: బుధవారం (25-11-2026) నాటి రాశి ఫలాలు ప్రకారం అన్ని రాశులవారికీ ఆర్థిక, వృత్తి, కుటుంబ రంగాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు, ప్రయాణాలు, బంధుమిత్రుల సంబంధాలు లాభిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20): బంధుమిత్రులకు సంబంధించిన శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలమైన రోజు. శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20): పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, బీమా చెల్లింపులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. విరాళాలు, సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు.

మిథునం (మే 21 - జూన్ 21): శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. గృహారంభ ప్రవేశాలకు అనుకూలం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23): లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి దూర ప్రయాణాలకు అనుకూలం. టెక్స్‌టైల్స్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ, ప్రచురణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23): ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ లక్ష్మీగణపతి స్తోత్ర పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23): ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు అనుకూలం. పై అధికారులు, పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తి అవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23): దూర ప్రయాణాలు, అందుకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. మహగణాధిపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22): విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21): జన సంబంధాలు విస్తరిస్తాయి. పండాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20): ఉద్యోగ, వ్యాపారాల్లో దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. దూరప్రాంతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహాలను ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19): చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారితో పరిచయాలు లాభిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. శ్రీ రామ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20): లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. వారి సూచనలు లాభిస్తాయి. ఇల్లు, స్థిరాస్తి విషయాల్లో ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పై అధికారుల వైఖరిలో మార్పు గమనిస్తారు. మహాగణాధిపతి ఆరాధన శుభప్రదం.

Tags: