Total Solar Eclipse Today: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం..భారత్ లో దీని ప్రభావం ఉంటుందా.?
భారత్ లో దీని ప్రభావం ఉంటుందా.?
Total Solar Eclipse Today: ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్భుతమైన దృగ్విషయం 'సంపూర్ణ సూర్య గ్రహణం' (Total Solar Eclipse) ఇవాళ ఈ మహా అద్భుతం ఆవిష్కృతం కానుంది. అసలు ఈ గ్రహణ సమయం ఎంత? ఎక్కడెక్కడ కనిపిస్తుంది? భారత్‌పై దీని ప్రభావం ఉందా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అధికారికంగా ఈ సూర్య గ్రహణం 2026 ఆగస్టు ఇవాళ రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:28 గంటల వరకు ఈ ఖగోళ అద్భుతం కొనసాగుతుంది. రాత్రి 11:16 గంటల ప్రాంతంలో ఈ గ్రహణం గరిష్ట స్థాయికి (Maximum Phase) చేరుకుంటుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
ఈ సంపూర్ణ సూర్య గ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్ పోర్చుగల్ దేశాల పరిధిలోని కొన్ని ప్రాంతాలలో పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఇది పాక్షికంగా దర్శనమిస్తుంది. అయితే, భారత్ వాసులకు ఇది నిరాశ కలిగించే విషయమే! ఈ గ్రహణం సమయంలో మన దేశంలో సూర్యుడు క్షితిజ సమాంతరానికి దిగువన (Night time) ఉండటం వల్ల, భారతదేశంలో ఈ సూర్య గ్రహణం అసలు కనిపించదు.
భారతదేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించనందువల్ల, ఇక్కడ ఎలాంటి 'సూతక్ కాలం' (Sutak Kaal) వర్తించదు. పండగలు లేదా మతపరమైన నియమాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్‌లోని ప్రజలు ఎలాంటి మినహాయింపులు పాటించాల్సిన పనిలేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఖగోళ ప్రియులు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు.