Trigrahi Yoga in Capricorn: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల రాశి, నక్షత్ర సంచారాలు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల రాజు అయిన సూర్యుడు, గ్రహాల యువరాజు బుధుడు, కేతువుల సంయోగ ప్రభావంతో ఏర్పడుతున్న విశేష గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, అదృష్టాన్ని తీసుకురానుంది. ఈ త్రిగ్రహ అనుకూలత వల్ల విశేష ప్రయోజనాలు పొందనున్న ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే:

కర్కాటక రాశి

కుటుంబంలో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేయాలనే దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం. ఉద్యోగులకు ఆఫీసులో కీలకమైన కొత్త బాధ్యతలు, ప్రశంసలు దక్కుతాయి.

తులా రాశి

గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు చేకూరతాయి. వ్యాపారులు, వర్తకులకు భారీ లాభాలను అందించే సరికొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సరికొత్త అవకాశాలు అందివచ్చి కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి కలిగే బలమైన యోగం ఉంది.

మకర రాశి

ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టమవుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు అందుతాయి. వృత్తిపరంగా విశేష పురోగతి లభిస్తుంది. కష్టపడి పనిచేసే తత్వంతో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు, కొందరికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు, కోర్టు లేదా అధికారిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి.

Tags: