Varalakshmi Vratam: వరమహాలక్ష్మి వ్రతం వేళ ఈ మూడు ప్రదేశాలను క్లీన్‌గా ఉంచితే లక్ష్మీదేవి కృప...

ఈ మూడు ప్రదేశాలను క్లీన్‌గా ఉంచితే లక్ష్మీదేవి కృప...;

Update: 2025-08-05 11:08 GMT

Varalakshmi Vratam: వరమహాలక్ష్మి పండుగ సమీపిస్తోంది. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఏమి చేయాలో పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవి ఇంట్లోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. లక్ష్మీదేవి కృప కావాలంటే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మొదట తులసి చెట్టు పెట్టే ప్రదేశం. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న తులసి చెట్టు వద్ద శుభ్రంగా ఉండేలా చూసుకోవలి. ఇది లక్ష్మీదేవి మొదట చూసే ప్రదేశం. తులసి చెట్టు ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసి అందంగా ఉంచడం చాలా అవసరం.

రెండవది ప్రధాన ద్వారం లేదా సింహద్వారం. ఇంటి ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉండాలి. పసుపు-కుంకమతో అలంకరించాలి. పూజ వస్తువులను ఉంచడం, దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు.

మూడవదిగా.. ఇంటి మొత్తం పరిశుభ్రత. ఇంట్లోని అన్ని భాగాలను శుభ్రం చేయడం, దుమ్ము తొలగించడం చాలా అవసరం. ఆవు పేడ లేదా ఆవు మూత్రంతో శుద్ధి చేయడం కూడా మంచిది.

ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ప్రేమగా ఉండాలి. ఇంటి సభ్యులు ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో ఉండాలి. ఈ అంశాలన్నీ లక్ష్మీదేవి అనుగ్రహానికి దారితీస్తాయి. ఈ దశలను విశ్వాసంతో పాటిస్తే, లక్ష్మీదేవి యొక్క అపారమైన కృప లభిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.

Tags:    

Similar News