Vastu Tip: వాస్తు చిట్కా.. మీ అదృష్టాన్ని మార్చే కలబంద.. ఇంట్లో ఏ దిశలో ఉంటే సంపద పెరుగుతుందో తెలుసా?

ఇంట్లో ఏ దిశలో ఉంటే సంపద పెరుగుతుందో తెలుసా?

Update: 2026-04-10 11:51 GMT

Vastu Tip: కలబంద అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణ. కానీ భారతీయ వాస్తు శాస్త్రం మరియు ఆధ్యాత్మిక సంప్రదాయంలో కలబందకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక మొక్కగా కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు.

ముక్కోటి దేవతల నిలయం

శాస్త్రాల ప్రకారం.. కలబంద మొక్కలోని ప్రతి ముల్లు ఒక దేవత తలతో సమానమని నమ్ముతారు. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతలు ఈ మొక్కలో కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ, అవి దేవునితో సమానమని, చెట్లను ప్రేమించే వారు భూమిపై అత్యంత సుఖంగా జీవిస్తారని పేర్కొన్నారు.

దుష్టశక్తుల నివారణకు అద్భుత చిట్కా

ఇంట్లోకి ప్రతికూల శక్తులు లేదా దిష్టి ప్రవేశించకుండా ఉండటానికి కలబంద ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీని కోసం ఒక ప్రత్యేక పద్ధతిని నిపుణులు సూచిస్తున్నారు..

అమావాస్య రోజున: ఒక కలబంద మొక్కను వేళ్లతో సహా పెకిలించి, శుభ్రం చేయాలి. దానికి పసుపు, కుంకుమ మరియు చందనంతో అలంకారం చేసి దేవుని వద్ద ఉంచాలి.

మరుసటి రోజు : ఆ మొక్కను ఒక దారం సహాయంతో ఇంటి గడపకు కుడి వైపున కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే చెడు ఆలోచనలను, దిష్టిని ఆ మొక్క గ్రహిస్తుంది. ప్రతి నెలా అమావాస్య రోజున పాత మొక్కను తీసివేసి కొత్త దానిని కట్టడం శ్రేయస్కరం.

వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలి?

సానుకూల శక్తిని ఆకర్షించడానికి కలబందను ఉంచే దిశ చాలా ముఖ్యం

ఈశాన్య దిశ: వాస్తు నిపుణుల ప్రకారం, కలబంద మొక్కను ఇంటికి ఈశాన్య దిశల* ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుంది.

అమరిక: మొక్కను వేలాడదీసేటప్పుడు వేర్లు పైకి, ఆకులు కిందికి ఉండేలా అమర్చడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇది వైవాహిక సమస్యలను తగ్గించి, గ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్య సంజీవిని

ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆయుర్వేదంలో కూడా కలబందను సంజీవినిగా పిలుస్తారు. దీనిని ఆవు పాలతో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులు అదుపులోకి వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News