Wearing a Pearl for Peace of Mind: మనశ్శాంతి కోసం ముత్యం ధరిస్తున్నారా? ఈ రాశుల వారు పొరపాటున కూడా పెట్టుకోవద్దు..

ఈ రాశుల వారు పొరపాటున కూడా పెట్టుకోవద్దు..

Update: 2026-07-13 05:02 GMT

Wearing a Pearl for Peace of Mind: నవరత్నాలలో ఒకటైన ముత్యం చూడటానికి ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యం నవగ్రహాలలో ఒకటైన చంద్రునికి ప్రతీక. చంద్రుడు మనిషి యొక్క మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలకు అధిపతి. జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉన్నప్పుడు మానసిక ఆందోళన, కోపం, తీవ్రమైన ఒత్తిడి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి నివారణకు చాలామంది ముత్యాన్ని ధరిస్తుంటారు. అయితే, ముత్యం ప్రశాంతతను ఇస్తుంది కదా అని అందరూ దీనిని ధరించకూడదని, కొన్ని రాశుల వారికి ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముత్యం ధరించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:

మానసిక ప్రశాంతత:

ముత్యం ధరించడం వల్ల మనస్సు అదుపులోకి వస్తుంది. అతిగా ఆలోచించడం, అనవసర భయాలు, మానసిక ఆందోళనలు తగ్గుతాయి.

కోపం తగ్గుతుంది:

ఎవరైతే చిన్న విషయాలకే తీవ్రమైన కోపానికి గురవుతారో, వారి కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మార్చడంలో ముత్యం అద్భుతంగా పనిచేస్తుంది.

నిద్రలేమి సమస్యకు చెక్:

రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టని వారు, పీడకలలతో ఇబ్బంది పడేవారు ముత్యాన్ని ధరిస్తే హాయిగా నిద్ర పడుతుంది.

ఆరోగ్య లాభాలు:

శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి, రక్తపోటు నియంత్రణకు ఉదర సంబంధిత సమస్యల నివారణకు ముత్యం సహాయపడుతుంది.

ముత్యాన్ని తప్పక ధరించాల్సిన రాశులు:

ముత్యం చంద్రుని రత్నం కాబట్టి, చంద్రుని సొంత రాశి అయిన కర్కాటక రాశి వారికి ఇది అమృతం లాంటి ఫలితాలను ఇస్తుంది. వీరితో పాటు వృషభం, మీన రాశి వారు ముత్యాన్ని ధరించడం వల్ల అపారమైన లాభాలను పొందుతారు. జాతక చక్ర విశ్లేషణను బట్టి వృశ్చిక రాశి వారు కూడా నిపుణుల సలహాతో దీనిని ధరించవచ్చు.

ముత్యా నికి దూరంగా ఉండాల్సిన రాశులు

ముత్యం శాంత స్వభావం కలది అయినప్పటికీ కొన్ని రాశుల వారికి ఇది అస్సలు పడదు. మేషం, సింహం, ధనుస్సు, కుంభ రాశి జాతకులు ముత్యాన్ని ధరించకుండా ఉండటమే మంచిది. ఈ రాశుల వారు ముత్యం ధరిస్తే మానసిక ప్రశాంతత దక్కకపోగా.. జీవితంలో ఒడిదుడుకులు, భావోద్వేగాల అసమతుల్యత, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ముత్యాన్ని ఎలా ధరించాలి?

ముత్యాన్ని ఎల్లప్పుడూ వెండి ఉంగరంలో చేయించుకుని, చేతి చిటికెన వేలికి ధరించాలి. ఏదైనా సోమవారం ఉదయం పూట, శుక్ల పక్షం సమయంలో శివుడికి లేదా చంద్రునికి పూజ చేసి, చంద్రా మంత్రాన్ని 108 సార్లు జపించి దీనిని ధరించడం వల్ల ఆశించిన పూర్తి ఫలితాలు దక్కుతాయి.

గమనిక: ఎలాంటి రత్నాన్ని ధరించాలన్నా కేవలం రాశిని బట్టే కాకుండా, మీ పూర్తి జాతక చక్రాన్ని ఒక మంచి జ్యోతిష్యుడికి చూపించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News