Wearing Blue Sapphire: నీలమణి ధరిస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఈ 3 రత్నాలతో కలిపి ధరిస్తే ప్రమాదం ఖాయం!
ఈ 3 రత్నాలతో కలిపి ధరిస్తే ప్రమాదం ఖాయం!
Wearing Blue Sapphire: వేద జ్యోతిషశాస్త్రంలో రత్నాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జాతకంలోని నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి చాలామంది రత్నాలను ధరిస్తుంటారు. వీటిలో కర్మఫలదాత అయిన శని దేవునికి ప్రియమైన నీలమణి అత్యంత శక్తివంతమైనది. జాతకంలో ఏడున్నర శని, శని ధైయా ప్రభావం వల్ల కలిగే కష్టాలను తొలగించి, జీవితంలో ఊహించని మార్పులు తీసుకురావడానికి నీలమణి సహాయపడుతుంది.
అయితే, నీలమణి ఎంత శక్తివంతమైనదో.. అంతటి వేగవంతమైన ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం, శని దేవుడికి శత్రు గ్రహాలుగా భావించే కొన్ని రత్నాలను నీలమణితో కలిపి అస్సలు ధరించకూడదు. అలా ధరిస్తే సానుకూల ఫలితాలకు బదులు, జీవితంలో తీవ్ర నష్టాలు ఎదురవుతాయి.
ఈ 3 రత్నాలను నీలమణితో అస్సలు కలపకండి:
కెంపు (Ruby):
కెంపు రత్నం సూర్య గ్రహానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని దేవుడు తండ్రీకొడుకులైనప్పటికీ, ఒకరికొకరు బద్ధ శత్రువులు. నీలమణి, కెంపులను కలిపి ధరించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాలలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ముత్యం :
ముత్యం మనస్సుకు కారకుడైన చంద్ర గ్రహానికి సంబంధించినది. శని, చంద్రుడి మధ్య తీవ్ర శత్రుత్వం ఉంది. జ్యోతిషంలో వీరి కలయికను అశుభంగా భావిస్తారు. ముత్యాన్ని నీలమణితో కలిపి ధరిస్తే మనశ్శాంతి పూర్తిగా నశిస్తుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నెగటివ్ ఆలోచనలు, డిప్రెషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
పగడం
పగడం కుజ గ్రహానికి సంబంధించిన రత్నం. కుజుడు, శని పరస్పర వ్యతిరేక స్వభావం కలిగిన గ్రహాలు. ఈ రెండింటి కలయిక వల్ల మనిషిలో కోపం, దూకుడు విపరీతంగా పెరుగుతాయి. మాటలు, ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయి, భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
నీలమణితో పాటు ధరించదగ్గ శుభప్రదమైన రత్నాలు
శని దేవుని మిత్ర గ్రహాలైన బుధ, శుక్ర, రాహువుల రత్నాలను నీలమణితో కలిపి ధరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
పచ్చ : బుధ గ్రహ రత్నం
వజ్రం : శుక్ర గ్రహ రత్నం
గోమేధకం: రాహు గ్రహ రత్నం
ఈ రత్నాల కలయిక వల్ల సమాజంలో మంచి గుర్తింపు, భౌతిక సౌకర్యాలు, వ్యాపార-వృత్తి రంగాలలో అపూర్వమైన విజయం, అపారమైన సంపద చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.