Devotional: కృష్ణ పింగళ సంకట హర చతుర్ధి అంటే ఏంటి.?..ఆ రోజు ఏం చేయాలి.?

ఆ రోజు ఏం చేయాలి.?;

Update: 2025-06-12 04:21 GMT

Devotional: వినాయకుడి చవితి( చతుర్థి) తిథి అంటే చాలా ఇష్టం.. అందుకే ప్రతి చవితి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కృష్ణ పింగళ సంకట హర చతుర్థి జూన్​ 14 న వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3:46 గంటలకు ప్రారంభమై జూన్ 15, మధ్యాహ్నం 3:51 గంటలకు ముగుస్తుంది. సంకష్ట చతుర్థి జూన్ 14న శనివారం ఉదయం తిథితో జరుపుకుంటారు.

కృష్ణపింగళ సంకట హర చతుర్ధి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి, చంద్రుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం ముగించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పూజలో గణేశుడికి దర్భ గడ్డి, మోదకం, పండ్లు మొదలైనవి సమర్పించాలి. ఇలా పూజిస్తే గణేశుడి ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

సంకటహర చతుర్థి ప్రాముఖ్యత

సంకటహర చతుర్థి రోజున భక్తులు గణేశుడి కృష్ణ పింగళ మహా గణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి.

పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవ రాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు. అందువల్ల భక్తుడు గణేశుడి ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. వ్రత కథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజిస్తారు. ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

Tags:    

Similar News