Lalbaugcha Ganpati: లాల్‌బాగ్చా గణపతి స్పెషల్ ఏంటంటే.?
స్పెషల్ ఏంటంటే.?;
Lalbaugcha Ganpati: లాల్‌బాగ్చా గణేశ్ విగ్రహం అనేది భారతదేశంలోని ముంబైలో గణేశ్ విగ్రహం. దీనిని లాల్‌బాగ్చా రాజా అని కూడా పిలుస్తారు. ఇది ముంబైలోని అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి విగ్రహాలలో ఒకటి. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి సందర్భంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పి, లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు.
1934లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముంబైలో బట్టల మార్కెట్ కోసం స్థలం ఇవ్వకపోవడంతో స్థానికులందరూ కలిసి గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఈ విగ్రహం భక్తులను ఆకర్షిస్తూ వస్తోంది. ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన, సుప్రసిద్ధ గణేశ విగ్రహాలలో ఇది ఒకటి. దీనిని కోరికలు తీర్చే గణేశుడు (నవసాచా గణపతి) అని కూడా అంటారు. భక్తులు తమ కోరికలు నెరవేర్చమని ఈ గణేశుడిని వేడుకుంటారు.
సుమారు12 అడుగులు ఎత్తున్న ఈ లాల్ బాగ్ ఛా విగ్రహం ఆకర్షణగా నిలిచింది. లాల్ బాగ్ ఘాట్ వేదికపై ప్రత్యేకంగా నిర్వహించిన పూజాది కార్యక్రమాలు యువత నుంచివృద్ధుల వరకు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ విగ్రహం చాలా శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు.గణేశ చతుర్థి సందర్భంగా లాల్‌బాగ్చా గణేశ్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి సెలబ్రిటీలు,ప్రముఖులు వస్తారు. ప్రతి సంవత్సరం ఈ విగ్రహం దర్శనం కోసం చాలా గంటల పాటు భక్తులు క్యూలో వేచి ఉంటారు. గణేశ చతుర్థి సమయంలో ఇక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గత ఏడాది ఈ గణేశుడికి రూ. 5 కోట్ల 65లక్షల నగదు, 4కిలోల బంగారం కానుకగా వచ్చాయి.