Bakrid Festival in India: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం ఇస్లాంలోనే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈద్-ఉల్-అధా.. అంటే మన బక్రీద్‌ను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లోని చివరి నెల అయిన 'జిల్ హజ్' 10వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. సరిగ్గా ఇదే సమయంలోనే మక్కాలో పవిత్రమైన వార్షిక హజ్ యాత్ర కూడా జరుగుతుంది.

అసలు ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో తెలుసా? బక్రీద్ పండుగకు ప్రవక్త ఇబ్రహీం కథతో, అల్లాహ్ పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తితో గాఢమైన సంబంధం ఉంది. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం.. అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి ప్రవక్త ఇబ్రహీం తన సొంత కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన నిష్కల్మషమైన విశ్వాసానికి మెచ్చిన అల్లాహ్.. ఆ బలి జరగడానికి ముందే కుమారుడి స్థానంలో ఒక జంతువును ఉంచారు. ఆ త్యాగానికి గుర్తుగానే, నాటి నుండి నేటి వరకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీలు, దానధర్మాలతో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

2026లో ఈ పండుగ ఎప్పుడు ?

సౌదీ అరేబియాలో జిల్ హజ్ నెలవంక కనిపించడంతో, అక్కడ మే 27, బుధవారం నాడు ఈద్-ఉల్-అధా వేడుకలు జరగనున్నాయి. అలాగే అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన 'అరఫా దినోత్సవం' మే 26న రానుంది. భారతదేశంతో పాటు మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా మే 27నే పండుగగా ప్రకటించారు. అయితే, స్థానిక చంద్ర దర్శన కమిటీల సమాచారం ప్రకారం.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో, దేశవ్యాప్తంగా మే 28, గురువారం నాడు బక్రీద్ పండుగను అధికారికంగా జరుపుకోనున్నారు. కానీ కాశ్మీర్‌లో మాత్రం స్థానిక పెద్దల ధృవీకరణతో మే 27నే ఈద్ వేడుకలు జరగనున్నాయి. పలు నగరాల్లోని ఈద్గాలు, మసీదులు ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే సిద్ధమయ్యాయి.

Tags: