Devotional: పూజా సామాగ్రిని ఏ దిశలో ఉంచకూడదు?

ఏ దిశలో ఉంచకూడదు?;

Update: 2025-06-12 04:29 GMT

Devotional: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ వస్తువులు ఎక్కడ పెట్టాలి..ఏ దిశలో ఉంచితే మంచిది . వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశను యమరాజుకు చెందినదిగా చెబుతారు..అందుకని దక్షిణ దిశలో పూజకు సంబంధించిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తితో పాటు చెడు ప్రభావాలు పెరుగుతాయి. ఇంకా ఈ దిశలో పూర్వీకులు ఉంటారు. అందుకే పూజ వస్తువులను ఇక్కడ ఉంచితే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సమస్యలు వస్తాయి.

ఇంట్లో ఆగ్నేయ దిశలో బాత్రూమ్ దగ్గర పూజా సామాగ్రిని ఉంచకూడదు. ఆ ప్రదేశంలో పూజా వస్తువులను ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అపవిత్రమైన ప్రదేశాల్లో ఉంచితే పూజా ద్రవ్యాల స్వచ్చత కోల్పోతాయి. ప్రధాన ద్వారం దగ్గర, మరుగుదొడ్డి దగ్గర, మెట్ల క్రింద ఎప్పుడూ పూజావస్తువులను ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

పూజా వస్తువులను ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచాలి. అప్పుడే శుభ ఫలితాలతో పాటు దేవతల ఆశీర్వాదాలను కూడా పొందుతారు. పూజ వస్తువులు తూర్పువైపే ఉండాలి. అలాగే పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు దిక్కులో ఉండాలి. ఇలా పూజిస్తే సంతోషం .. అదృష్టం కలసి వస్తుంది. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది..సాధ్యమైనంత పూజ స్థలం ఈశాన్యంలోనే ఉండాలి. అలా కుదరని పక్షంలో ఒకవేళ మార్చుకుంటే పడమర వాయువ్యం వైపు పెట్టుకోవాలి.

Tags:    

Similar News