Atiratha and Maharatha: అతిరథ మహారథులు అంటే ఎవరు? ఈ పేరు వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ఈ పేరు వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Atiratha and Maharatha: మనం తరచుగా ఏదైనా రంగంలో అత్యంత సమర్థులను, శక్తిమంతులను వర్ణించడానికి 'అతిరథ మహారథులు' అనే పదాన్ని వాడుతుంటాం. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? మన పురాణాల ప్రకారం యుద్ధ నైపుణ్యాన్ని బట్టి వీరులను ఐదు స్థాయిలుగా విభజించారు. ఆ అద్భుతమైన శక్తి లెక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి స్థాయి.. రథి. ఒకేసారి ఐదు వేల మంది శత్రువులతో ఒంటరిగా యుద్ధం చేయగలవాడిని 'రథి' అంటారు.ఇక రెండో స్థాయి.. అతిరథి. ఒక అతిరథి శక్తి.. పన్నెండు మంది రథులతో సమానం. అంటే దాదాపు 60 వేల మందితో తలపడగలడన్నమాట.మూడో స్థాయి మహారథి. పన్నెండు మంది అతిరథుల శక్తి కలిస్తే ఒక మహారథి అవుతాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు వంటి వారు ఈ కోవకే చెందుతారు.
దీనికి మించిన వారు అతి మహారథులు. వీరి శక్తి 12 మంది మహారథులకు సమానం. ఇక అన్నింటికంటే పరాకాష్ట.. మహామహారథి. ఒక్క మహామహారథి.. 24 మంది మహారథుల శక్తికి సమానం. అంటే లక్షలాది మంది సైన్యాన్ని ఒక్కడే ఎదుర్కోగలడన్నమాట.వీరందరినీ కలిపి మనం గౌరవపూర్వకగా 'అతిరథ మహారథులు' అని పిలుస్తాం. కాలక్రమేణా ఈ పదం ఏ రంగంలోనైనా అపారమైన అనుభవం, శక్తి ఉన్నవారిని సంబోధించడానికి ఒక జాతీయంగా మారిపోయింది.