Devotees Perform Pradakshina in Temples: హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన కేవలం దైవ దర్శనానికే పరిమితం కాదు. గుడికి వెళ్లినప్పుడు ఆవరణలో చేసే ప్రదక్షిణలకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రాధాన్యత ఉంది. ప్ర అంటే పాపాలను నశింపజేసేది, ద అంటే కోరికలను నెరవేర్చేది, క్షి అంటే సమస్త సంపదలను ఇచ్చేది, ణ అంటే ముక్తిని ప్రసాదించేది అని అర్థం. దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రదక్షిణలు ఎలా చేయాలి?

సవ్య దిశ :

ప్రదక్షిణ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సవ్య దిశలో మాత్రమే నడవాలి. గర్భగుడి, మూలవిరాట్టు ఎల్లప్పుడూ మన కుడి వైపున ఉండేలా చూసుకోవాలి. అందుకే దీనిని ఆత్మ ప్రదక్షిణ లేదా దక్షిణ ప్రదక్షిణ అంటారు.

నడక ప్రశాంతంగా ఉండాలి:

ప్రదక్షిణ చేసే సమయంలో వేగంగా పరిగెత్తడం లేదా నడవడం చేయకూడదు. ప్రసవించిన స్త్రీ నెత్తిపై నీటి కుండను పెట్టుకుని ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో అంత శాంతంగా, భక్తిశ్రద్ధలతో నడవాలని శాస్త్రం చెబుతోంది.

చేతులు మడిచి దండం పెట్టాలి:

ప్రదక్షిణ చేస్తున్నంత సేపు చేతులు ఊపకుండా, హృదయ స్థానంలో నమస్కార ముద్రలో ఉంచి ఇష్టదైవ నామస్మరణ చేయాలి.

ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

ఆయా దేవతల తత్వాలను బట్టి ప్రదక్షిణల సంఖ్య వేర్వేరుగా ఉంటుంది.

సూర్యభగవానుడు: 1 ప్రదక్షిణ (సూర్య నమస్కారంతో సమానం).

వినాయకుడు: 1 లేదా 3 ప్రదక్షిణలు.

శ్రీమహా విష్ణువు (రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి): 4 ప్రదక్షిణలు.

పరమశివుడు- 3 ప్రదక్షిణలు

శక్తి స్వరూపిణి (అమ్మవారు): 4 ప్రదక్షిణలు.

ఆంజనేయస్వామి - కార్తికేయుడు (సుబ్రహ్మణ్యస్వామి): 5 ప్రదక్షిణలు.

రావి చెట్టు (అశ్వత్థ వృక్షం): 7 లేదా 108 ప్రదక్షిణలు (పాప నివారణ, సంతాన ప్రాప్తికి).

ప్రదక్షిణల వల్ల కలిగే ఆధ్యాత్మిక & శారీరక ప్రయోజనాలు:

శాస్త్రీయ కోణం:

దేవాలయాల్లో గర్భగుడికి కింద రాగి నాణాలు, చక్రాలు నిక్షిప్తం చేయడం వల్ల అక్కడ భూమి యొక్క ధనాత్మక అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రదక్షిణలు చేయడం వల్ల శరీరం ఆ శక్తిని గ్రహించి, నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.

మానసిక ప్రశాంతత: ప్రదక్షిణ చేసేటప్పుడు మెదడులోని ఒత్తిడి తగ్గి, ఆందోళన నివారించబడి మనస్సు నిర్మలంగా మారుతుంది.

పాప ప్రక్షాళన: మనస్సు, వాక్కు, కాయముతో తెలిసీ తెలియక చేసిన సకల పాపాలు ప్రదక్షిణ చేయడం ద్వారా నశిస్తాయని నమ్ముతారు.

Tags: