Holika Dahan Performed: హోలీకా దహనం ఎందుకు చేస్తారు.?

ఎందుకు చేస్తారు.?

Update: 2026-03-02 11:55 GMT

Holika Dahan Performed: హిందూ సంప్రదాయంలో హోలికా దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన పురాణ కథ 'భక్త ప్రహ్లాదుడు' అతని తండ్రి 'హిరణ్యకశ్యపుడి'కి సంబంధించిన కథ ప్రాచుర్యంలో ఉంది.

1. భక్త ప్రహ్లాదుని రక్షణ

రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువును పూజించడం సహించలేక పోతాడు. ఎలాగైనా తన కొడుకును చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశ్యపుని సోదరి హోలికకు ఒక వరం ఉంటుంది. అగ్ని ఆమెను ఏమీ చేయలేదు.

2. చెడుపై మంచి విజయం

హిరణ్యకశ్యపుని ఆదేశం మేరకు, హోలిక ప్రహ్లాదుడిని చంపడానికి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్తుంది. అయితే, ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడంతో విష్ణువు అనుగ్రహం వల్ల మంటల నుండి క్షేమంగా బయటపడతాడు. కానీ, దురుద్దేశంతో అగ్నిలో ప్రవేశించిన హోలిక మాత్రం ఆ మంటల్లో భస్మమైపోతుంది.

3. దుష్టశక్తుల అంతం

హోలిక దహనం ద్వారా సమాజంలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, దుష్ట ఆలోచనలను తగలబెట్టాలని ఈ ఆచారం చెబుతుంది. ఈ మంటల్లో పాత వస్తువులను, కర్రలను వేయడం ద్వారా మనసులోని మాలిన్యాన్ని వదిలేసి, కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించాలని దీని ఉద్దేశ్యం.

ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. హోలికా దహనం జరిగిన మరుసటి రోజే మనం రంగులతో హోలీ పండుగను జరుపుకుంటాము.

Tags:    

Similar News