Shani Dosha Relief: శని దోష నివారణకు, ఐశ్వర్యానికి శనివారం ఈ రెండు చెట్లను పూజించండి..
ఈ రెండు చెట్లను పూజించండి..
Shani Dosha Relief: హిందూ సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పూర్వ కాలం నుండి చెట్లు, నదులు, పర్వతాలను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం, వారంలోని ఏడు రోజులలో ఆయా రోజులకు సంబంధించిన ప్రత్యేక వృక్షాలను పూజించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోయి, జీవితంలో సుఖశాంతులు, సమృద్ధి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా శనివారం నాడు శని దేవుని అనుగ్రహాన్ని పెంపొందించుకోవడానికి, కష్టాల నుండి విముక్తి పొందడానికి రావి చెట్టు, జమ్మి చెట్టు పూజించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
రావి చెట్టు పూజ - విశిష్టత:
సనాతన సంప్రదాయంలో రావి చెట్టుకు అగ్రతాంబూలం ఇస్తారు. శాస్త్రాల ప్రకారం.. ఈ పవిత్ర వృక్షంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. అంతేకాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు పితృదేవతల నివాస స్థానం కూడా ఇదేనని నమ్ముతారు.
పూజా విధానం:
శనివారం ఉదయాన్నే స్నానం చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
లాభాలు:
శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల జాతకంలో పీడిస్తున్న తీవ్రమైన శని దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమై, ఇంట్లో సంపద, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
జమ్మి వృక్షం పూజ:
శమి లేదా జమ్మి చెట్టు శని దేవునికి అత్యంత ప్రియమైనది. మహాభారత కాలం నుంచే జమ్మి చెట్టు పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
పూజా విధానం:
శనివారం నాడు జమ్మి చెట్టుకు నీరు సమర్పించి, భక్తితో పూజించాలి.
లాభాలు:
ఈ పూజ వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోయి, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి, సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు, వాస్తు దోషాల నివారణకు కూడా జమ్మి వృక్ష పూజ ఉత్తమ మార్గంగా చెప్పబడింది.