Hanuman Jayanti Celebrations: తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు

హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద TTD వేడుకగా నిర్వహించింది.

Update: 2026-05-13 11:02 GMT

hanuman jayanti 2026

Grand Hanuman Jayanti Celebrations: హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద వేద మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడుమ టీటీడీ ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో స్థానికంగా ఉన్న ప‌లు హ‌నుమాన్ ఆల‌యాల్లో కూడా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.

ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం జరిగింది. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

Tags:    

Similar News