Health: గుమ్మడి గింజలు ఎక్కువగా తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..
గుమ్మడి గింజలు ఎక్కువగా తింటున్నారా..?;
Health: గుమ్మడి గింజలు పోషకాల నిలయం. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజల్లో విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి2, ఫోలేట్, బీటా-కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన హెల్త్ కు ఎన్నో విధాలమేలు చేస్తాయి. అందుకే వీటిని చాలా మంది రెగ్యులర్ గా తమ ఆహారంలో చేర్చుకుంటారు. కానీ మంచిదని భావించే అమృతం కూడా ఎక్కువగా తీసుకుంటే విషంగా మారుతుంది. గుమ్మడి గింజలకు అదే వర్తిస్తుంది. ఈ సీడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గుమ్మడి గింజల దుష్ప్రభావాలు:
హెల్త్ కు మంచి చేసే గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
గుమ్మడి గింజలు ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలెర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే బెటర్.
గుమ్మడి విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వచ్చే అవకాశాలున్నాయి.
తక్కువ బీపీ ఉన్న వారు గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కాబట్టి ఇప్పటికే తక్కువ రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తినకపోవడమే మంచిది.
గుమ్మడి గింజలను చిన్న పిల్లల గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు దూరంగా ఉంచాలి. పెద్దలు సైతం వీటిని సరిగ్గా నమిలి, మింగాలి.
గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.