Ashadha Amavasya 2026: ఆషాఢ అమావాస్య: ఈ 4 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
అత్యంత జాగ్రత్తగా ఉండాలి
Ashadha Amavasya 2026: హిందూ సంప్రదాయం, జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య తిథికి ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి, అమావాస్య రోజులలో విశ్వంలో, గ్రహాల స్థానాల్లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల ప్రతికూల శక్తుల ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఆగస్టు 12న వచ్చే ఆషాఢ మాసపు చివరి అమావాస్య సందర్భంగా గ్రహ సంచారం, గోచార ఫలితాల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తే అవకాశం ఉందట. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో మానసిక, శారీరక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులు ఏవి? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి
మేష రాశి వారికి ఈ అమావాస్య సమయం కొన్ని ఇబ్బందులను తీసుకురావచ్చు. మీరు ఎంతో ఆశగా ప్రారంభించిన పనులు చివరి నిమిషంలో అకస్మాత్తుగా నిలిచిపోయే సూచనలు ఉన్నాయి.
ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు. ప్రతి నిర్ణయాన్ని, అడుగును అత్యంత జాగరూకతతో వేయడం శ్రేయస్కరం.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరమైన సమస్యలు అధికంగా వేధించే అవకాశం ఉంది. రాబడి తగ్గిపోవడం వల్ల రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఏ పని కూడా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుని, ఎంత సహనంతో వ్యవహరిస్తే అంత మంచిదని జ్యోతిష్యులు సలహా ఇస్తున్నారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా మరియు ఆర్థికంగా ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఇంట్లో చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్న శుభకార్యాలు చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు జరిగి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. చేతిలో ఉన్న డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం, వృథా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం అవసరం.
కుంభ రాశి
కుంభ రాశి వారు తమ ఆరోగ్యం మరియు మాట తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శారీరకంగా, మానసికంగా తీవ్ర అసౌకర్యం, ఒత్తిడిని అనుభవించవచ్చు. ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపే మరొక కొత్త సమస్య తీవ్ర రూపం దాల్చవచ్చు. అనవసర వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎలాంటి ప్రతికూల చర్చల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం, ప్రతి నిర్ణయంలోనూ అదనపు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.