Non-Vegetarian Food Be Introduced to Children: చిన్నారులకు ఏ వయసులో నాన్ వెజ్ పెట్టాలి.?

ఏ వయసులో నాన్ వెజ్ పెట్టాలి.?

Update: 2026-02-12 06:22 GMT

Non-Vegetarian Food Be Introduced to Children: చిన్నారులకు నాన్‌వెజ్ (మాంసాహారం) ఎప్పుడు పెట్టాలనే విషయంలో చాలా మంది తల్లిదండ్రులకు సందేహాలు ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ,శిశువైద్యుల (Pediatricians) సూచనల ప్రకారం. శిశువులకు 6 నెలలు నిండిన తర్వాత ఘన పదార్థాలు (Solid foods) అలవాటు చేసే క్రమంలో నాన్‌వెజ్‌ను కూడా పరిచయం చేయవచ్చు. సాధారణంగా 6 నుండి 8 నెలల మధ్య దీనిని ప్రారంభించడం ఉత్తమం.

ఏ వయసు వారికి ఎలా పెట్టాలి

6 - 8 నెలలు వయసు చిన్నారులకు చికెన్, గుడ్డులోని పచ్చసొన (Egg yolk) బాగా ఉడికించి, మెత్తని పేస్ట్ (Puree) లాగా చేసి ఇవ్వాలి.

8 - 10 నెలల వారికి చికెన్ కీమా, చేపలు (ముళ్లు లేనివి) చిన్న చిన్న ముక్కలుగా లేదా మెత్తగా మెదిపి ఇవ్వవచ్చు.

12 నెలల పైన వారికి మటన్, గుడ్డులోని తెల్లసొన (Egg white) మటన్ అరగడానికి సమయం పడుతుంది కాబట్టి ఏడాది తర్వాత ఇవ్వడం మంచిది.

నాన్‌వెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు:

ఐరన్, జింక్: తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్ నుండి 6 నెలల తర్వాత పిల్లలకు ఐరన్ తక్కువగా అందుతుంది. మాంసాహారం ద్వారా ఐరన్, జింక్ పుష్కలంగా లభిస్తాయి.

ప్రోటీన్: శిశువు శారీరక ఎదుగుదలకు, కండరాల పుష్టికి ఇది ఎంతో అవసరం.

మెదడు వికాసం: చేపలలో ఉండే Omega-3 fatty acids పిల్లల మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి.

పాటించవలసిన జాగ్రత్తలు:

బాగా ఉడికించాలి: మాంసాన్ని చాలా మెత్తగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని మాంసం వల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

మసాలాలు వద్దు: పిల్లలకు ఇచ్చే మాంసాహారంలో కారం, ఎక్కువ మసాలాలు, ఉప్పు వేయకూడదు. కేవలం చిటికెడు పసుపుతో ఉడికిస్తే సరిపోతుంది.

ముళ్లు జాగ్రత్త: చేపలు ఇచ్చేటప్పుడు ముళ్లు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

3-రోజుల నియమం: ఏదైనా కొత్త ఆహారం (ఉదాహరణకు చికెన్) పెట్టినప్పుడు, వరుసగా మూడు రోజులు గమనించండి. వారికి ఏవైనా అలర్జీలు (దద్దుర్లు, వాంతులు, విరేచనాలు) వస్తున్నాయేమో చూడండి.

పరిమాణం: మొదట్లో ఒకటి లేదా రెండు టీస్పూన్లతో మొదలుపెట్టి, క్రమంగా పెంచాలి.

ముఖ్య గమనిక: మీ పాప లేదా బాబుకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా అలర్జీలు వస్తాయని భయం ఉన్నా, ఒకసారి మీ పీడియాట్రిషియన్ (పిల్లల డాక్టర్) ని సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Tags:    

Similar News