Beat Body Heat: ఒంట్లో అధిక వేడికి చెక్ పెట్టండి..ఈ 5 ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం!
ఈ 5 ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం!
Beat Body Heat: సాధారణంగా కొందరి శరీర తత్వం వల్ల లేదా మనం తీసుకునే ఆహారం, వాతావరణ మార్పుల వల్ల శరీరంలో వేడి అధికంగా పెరుగుతుంటుంది. దీనివల్ల నీరసం, కళ్ల మంటలు, చర్మ సమస్యలు వంటివి వేధిస్తుంటాయి. అయితే, ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఖరీదైన మందులు అవసరం లేదు. మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే శరీరానికి చల్లదనాన్ని అందించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా.. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత పానీయం కొబ్బరినీళ్లు. శరీరంలోని వేడిని తక్షణమే తగ్గించడంలో కొబ్బరినీళ్లకు సాటి మరొకటి లేదు. అలాగే కలబంద (Aloe Vera) రసాన్ని తీసుకోవడం వల్ల కూడా శరీరం లోపలి నుండి చల్లబడుతుంది. ఇక మనకు సులభంగా దొరికే పుదీనా. ఈ పుదీనాతో జ్యూస్ చేసుకుని తాగితే, అది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
వేసవి కాలమైనా, సాధారణ రోజులైనా శరీరానికి అమృతం లాంటిది మజ్జిగ. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్‌తో పాటు చల్లదనం కూడా అందుతుంది. దీనితో పాటు విటమిన్-సీ అధికంగా ఉండే ఆహార పదార్థాలు, అంటే నిమ్మకాయ, నారింజ వంటివి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూనే, శరీరం వేడెక్కకుండా కాపాడతాయి.
మరో ముఖ్యమైన చిట్కా ఏంటంటే.. ఆహారంలో కీరదోసను చేర్చుకోవడం. ఇందులో ఉండే అధిక నీటి శాతం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, శరీర వేడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగడం. తగినంత నీరు తాగితేనే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి, విషతుల్యాలు బయటకు పోతాయి.