Beat the Heat: ఎండ దెబ్బ నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకోగలిగే 6 ఉత్తమ పానీయాలు

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే 6 ఉత్తమ పానీయాలు

Update: 2026-03-28 07:42 GMT

Beat the Heat: శ్రీకాకుళం నుంచి అమెరికా వరకు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో, మధ్యాహ్నం వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడే కొన్ని అద్భుతమైన దేశీ పానీయాలు మరియు వాటి తయారీ విధానం మీకోసం.

1. ఆమ్ పన్నా (పచ్చి మామిడి పానీయం):

ఇది ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఉడికించిన పచ్చి మామిడి గుజ్జులో పంచదార లేదా బెల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు మరియు పుదీనా ఆకులు కలిపి దీనిని తయారు చేస్తారు.

2. మసాలా మజ్జిగ

మజ్జిగ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో తగినంత నీరు పోసి.. అందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, తరిగిన పుదీనా మరియు కొత్తిమీర కలిపి చల్లగా సర్వ్ చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

3. కోకమ్ షర్బత్:

కొంకణ్ తీర ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ పానీయం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కోకమ్ పండు గుజ్జును నీటిలో నానబెట్టి, అందులో పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

4. జల్ జీరా:

పుదీనా, జీలకర్ర, చింతపండు గుజ్జుతో చేసే ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకులను మిక్సీ పట్టి, అందులో జీలకర్ర పొడి, నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి చల్లని నీటిలో కలిపి తీసుకోవాలి.

5. తండాయ్:

ఇది పోషకాల గని. బాదం, జీడిపప్పు, గసగసాలు, సోంపు గింజలను నానబెట్టి పేస్ట్‌లా చేసి.. పాలు, పంచదార, కుంకుమపువ్వు కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

6. సత్తు పానీయం:

బీహార్‌లో అత్యంత ఫేమస్ అయిన ఈ హై-ప్రోటీన్ డ్రింక్ వేయించిన శనగపిండితో (Sattu Powder) చేస్తారు. నీటిలో సత్తు పొడి, నిమ్మరసం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి తాగితే ఆకలి తీరడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

Tags:    

Similar News