Best Fruits for Diabetes Patients: షుగర్ ఉన్నవారికి బెస్ట్ ఫ్రూట్స్..మీరు ఇవి తింటున్నారా?
మీరు ఇవి తింటున్నారా?
Best Fruits for Diabetes Patients: మధుమేహం(షుగర్) ఉన్నవారు పండ్లు తినవచ్చా? తింటే ఏ పండ్లు తినాలి? ఇది చాలా మందిని వేధించే ప్రశ్న. పండ్లలో సహజసిద్ధమైన చక్కెర (ఫ్రక్టోజ్) ఉన్నప్పటికీ, వాటిలో ఉండే ఫైబర్ ,విటమిన్లు శరీరానికి చాలా అవసరం. అయితే, అన్ని పండ్లు షుగర్ పేషెంట్లకు మంచివి కావు. ఏ పండ్లను ఎంచుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ ఉన్నవారు ప్రధానంగా 'గ్లైసీమిక్ ఇండెక్స్' (GI) తక్కువగా ఉన్న పండ్లను ఎంచుకోవాలి.
ఆపిల్: ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది చక్కెర రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తుంది.
జామకాయ: షుగర్ పేషెంట్లకు ఇది ఒక వరం లాంటిది. ఇందులో విటమిన్-సి , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
నేరేడు పండ్లు: ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
కివీ,స్ట్రాబెర్రీ: వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
బొప్పాయి: మితంగా తీసుకుంటే ఇది జీర్ణక్రియకు , షుగర్ కంట్రోల్‌కు సహాయపడుతుంది.
చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి లేదా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.ముఖ్యంగా మామిడి పండ్లు, సీతాఫలం, అరటిపండు, సపోటా వంటి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకునేటప్పుడు మీ షుగర్ లెవల్స్‌ను గమనించుకోవడం ముఖ్యం.అలాగే, పండ్లను జ్యూస్ రూపంలో అస్సలు తీసుకోవద్దు. జ్యూస్ తీసినప్పుడు అందులోని ఫైబర్ పోయి, చక్కెర నేరుగా రక్తంలోకి చేరుతుంది. కాబట్టి పండును నేరుగా కొరికి తినడమే ఉత్తమం.గుర్తుంచుకోండి పండ్లను ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. ఉదయం పూట లేదా సాయంత్రం స్నాక్ లాగా ఒక కప్పు పండ్లు తీసుకోవడం ఆరోగ్యకరం. ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మర్చిపోకండి.