Mixing Ghee with Rice Help Control Sugar Levels: ఇటీవలి కాలంలో డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో మధుమేహం కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలకారణమని డాక్టర్లు వివరించారు. రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఆయన కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు.

అన్నంలో నెయ్యి కలిపితే ఏం జరుగుతుంది?

తెల్లటి అన్నం (వైట్ రైస్) ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. అయితే మధుమేహం ఉన్నవారు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని డాక్టర్ విక్రాంత్ చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన కొవ్వులు: అన్నం తినేటప్పుడు అందులో కొద్దిగా నెయ్యి కలుపుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారించవచ్చు.

జీర్ణక్రియ నెమ్మదిస్తుంది:

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర ఒకేసారి కాకుండా, నిదానంగా విడుదలవుతుంది.

గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాలు..

ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం.

పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం.

రోజుకు చాలాసార్లు చక్కెర కలిపిన టీ లేదా కాఫీలు తాగడం.

ఇవన్నీ శరీరంలో 'ఇన్సులిన్ రెసిస్టెన్స్'కు దారితీసి.. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, మధుమేహం, గుండె సమస్యలకు కారణమవుతాయి.

సహజంగా షుగర్ అదుపు చేయాలంటే ఎలాంటి మార్పులు చేయాలి?

మధుమేహాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు..

ఉదయాన్నే బెడ్ టీ వద్దు:

ఉదయం పూట ఖాళీ కడుపుతో చక్కెర కలిపిన టీ లేదా కాఫీలు తాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి.

అల్పాహారంలో మార్పులు:

ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే టిఫిన్లకు బదులుగా.. గుడ్లు, మొలకలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

భోజన సమయాలు: రోజుకు చాలాసార్లు కాకుండా కేవలం రెండుసార్లు మాత్రమే ప్రధాన ఆహారం తినే అలవాటును అలవర్చుకోవడం మంచిది.

విటమిన్ బి12:

శరీరానికి అవసరమైన విటమిన్ బి12 లభించడం కోసం ఆహారంలో పాలు మరియు పెరుగు ఉండేలా చూసుకోవాలి.

సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే మధుమేహాన్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags: