Lung Cancer: సిగరెట్ కాల్చని వారికి లంగ్ క్యాన్సర్ వస్తుందా.?

వస్తుందా.?

Update: 2026-08-01 07:48 GMT

Lung Cancer: ధూమపానం చేసేవారికే కాదు, సిగరెట్ ముట్టని నాన్-స్మోకర్స్‌కు కూడా లంగ్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్న నిజం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం స్మోకింగ్ మాత్రమే కాకుండా గాలి కాలుష్యం, ఇళ్లలోని వంట పొగ, సెకండ్ హ్యాండ్ స్మోక్ వంటి అనేక కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ప్రముఖ పల్మోనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ ప్రమాదం నుంచి మన ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

మొదటిది.. ఇంటిలోని ఇండోర్ గాలిని శుభ్రంగా ఉంచుకోవడం. వంట చేసే సమయంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, దోమల మందులు, పొగ వచ్చే పదార్థాలను తగ్గించడం చాలా ముఖ్యం.

రెండోది.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనగా ఏక్యూఐని ఎప్పటికప్పుడు గమనించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో అవుట్‌డోర్ వ్యాయామాలకు బదులుగా ఇళ్లలోనే వర్కవుట్లు చేయడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్‌-95 మాస్క్‌లను ధరించడం తప్పనిసరి.

మూడోది.. ఊపిరితిత్తులను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడం. రోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం, సాధారణ శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది.

నాల్గోది.. పోషకాహారం తీసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ ను మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా కాలుష్య కారకాలతో పోరాడే శక్తి శరీయానికి లభిస్తుంది.

Tags:    

Similar News