Fatty Liver: రాత్రి పూట తిండి మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే...

నిపుణులు ఏమంటున్నారంటే...

Update: 2026-07-29 17:10 GMT

Fatty Liver: ఇటీవలి కాలంలో భారత్‌లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. ప్రారంభంలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే సరైన సమయంలో నివారణ చర్యలు తీసుకోకపోతే ఇది లివర్ వాపు, ఫైబ్రోసిస్, సరోసిస్, కాలేయ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే రాత్రి పూట భోజనం పూర్తిగా మానేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నయం అవుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై కాలేయ నిపుణులు స్పష్టతనిస్తూ పలు కీలక సూచనలు చేశారు.

రాత్రి పూట భోజనం బంద్ చేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?

రాత్రి భోజనం పూర్తిగా మానేయడం వల్ల ఫ్యాటీ లివర్ నయమవుతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం మానడం కంటే:

సమయానికి ఆహారం తీసుకోవడం

పరిమిత పరిమాణంలో తిండి తినడం

ఆలస్యంగా తినే అలవాటును మానుకోవడం

*రోజువారీ క్యాలరీల వినియోగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఫ్యాటీ లివర్‌ను సమర్థవంతంగా అదుపు చేయవచ్చని వివరిస్తున్నారు.

ఆలస్యంగా తింటే ఏమవుతుంది?

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆకలి ఎక్కువై అవసరానికి మించి తినేస్తాం. ఇది శరీరంలో క్యాలరీలు, కొవ్వు పెరిగిపోవడానికి, జీర్ణక్రియ మందగించడానికి కారణమవుతుంది. కాబట్టి పడుకునే సమయానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే రాత్రి భోజనం పూర్తి చేయడం మంచిది.

ఫ్యాటీ లివర్‌ను అదుపులో ఉంచే 5 ముఖ్యమైన చిట్కాలు

శరీర బరువు తగ్గించుకోవడం:

అధిక బరువు ఉన్నవారు తమ శరీర బరువులో కనీసం 7శాతం నుండి 10% తగ్గించుకుంటే, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు గణనీయంగా తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం:

వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత లేదా యోగా వంటి వ్యాయామాలు చేయాలి.

చక్కెర, జంక్ ఫుడ్‌కు దూరం:

కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, కేకులు, బిస్కెట్లు, ఎక్కువ తీపి పదార్థాలు, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత తగ్గించాలి.

ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారం:

రోజూ పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, సోయా, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా బరువు నియంత్రణలో ఉంటుంది.

మద్యపానానికి పూర్తిగా స్వస్తి:

ఆల్కహాల్ కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఫ్యాటీ లివర్ సాధారణ లక్షణాలు..

నిరంతరం అలసటగా అనిపించడం

కడుపులో కుడివైపు భాగంలో అసౌకర్యం లేదా నొప్పుగా ఉండటం

జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం

శరీరం బరువుగా అనిపించడం

Tags:    

Similar News