Mixing Okra: జాగ్రత్త.. బెండకాయతో ఈ కూరగాయలను కలిపి తింటున్నారా? ప్రయోజనం కంటే కీడే ఎక్కువ..

ప్రయోజనం కంటే కీడే ఎక్కువ..

Update: 2026-03-17 10:58 GMT

Mixing Okra: కూరగాయలలో బెండకాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఉండే పీచు పదార్థం, విటమిన్ సి, విటమిన్ కె మరియు యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అని బెండకాయను ఏ కూరగాయతో పడితే ఆ కూరగాయతో కలిపి వండటం లేదా తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహార కలయికలు శరీరంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.

బెండకాయతో కలిపి తినకూడని ఆహారాలు ఇవే:

బంగాళాదుంపలు: చాలా మంది బెండకాయ-ఆలు ఫ్రై ఇష్టంగా తింటారు. కానీ, బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటే, బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలో అసమతుల్యత ఏర్పడి, ఊబకాయం పెరిగే అవకాశం ఉంది.

ముల్లంగి: ముల్లంగి, బెండకాయల స్వభావం వేర్వేరు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ రావడమే కాకుండా.. చర్మ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

వంకాయ: వంకాయలో శరీరానికి ఇనుము అందకుండా చేసే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. బెండకాయలోని జిగట స్వభావం, వంకాయలోని అలెర్జీ కారకాలు కలిస్తే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి చర్మ సమస్యలు తలెత్తవచ్చు.

కాకరకాయ: కాకరకాయ, బెండకాయ రెండూ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, తలనొప్పి మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

ఇతర నిషేధిత పదార్థాలు:

కేవలం కూరగాయలే కాకుండా,

బెండకాయ తిన్న వెంటనే లేదా బెండకాయతో పాటు ఈ క్రింది వాటిని తీసుకోకూడదు:

పాలు - పెరుగు: ఇవి చర్మ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.

టీ : బెండకాయ తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

ఎర్ర మాంసం: ఇది కడుపులో తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయల పోషక విలువలతో పాటు, వాటిని ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటే సులభంగా జీర్ణమవుతాయో తెలుసుకోవడం ముఖ్యం. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ఈ ఆహార నియమాలను తప్పక పాటించాలి.

Tags:    

Similar News