Child Growth Stunted: పిల్లల శరీర దృఢత్వానికి, మేధో వికాసానికి ప్రోటీన్ అత్యంత కీలకమైన పోషకం. అయితే, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రోటీన్ లోపాన్ని గుర్తించలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు, కండరాల పుష్టికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రోటీన్ తప్పనిసరని ఆయన వివరించారు.

ప్రోటీన్ లోపాన్ని గుర్తించడం ఎలా?

పిల్లల్లో ప్రోటీన్ తక్కువగా ఉంటే ఈ క్రింది సంకేతాలు కనిపిస్తాయి:

ఎదుగుదల లోపం: వయస్సుకి తగ్గ ఎత్తు పెరగకపోవడం, బరువు తక్కువగా ఉండటం.

కండరాల బలహీనత: కండరాలు సరిగ్గా అభివృద్ధి చెందవు, దీనివల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు.

తరచుగా అనారోగ్యం: రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా గురవుతారు.

చర్మం - జుట్టు: చర్మం పొడిబారడం, జుట్టు రాలడం లేదా పల్చబడటం వంటి మార్పులు కనిపిస్తాయి.

నీరసం: శారీరక శ్రమ చేయకపోయినా నిరంతరం నీరసంగా అనిపించడం.

లోపానికి ప్రధాన కారణాలు:

పిల్లలకు కేవలం కడుపు నిండే ఆహారం కాకుండా, పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లు వంటివి పిల్లల డైట్‌లో లేకపోవడం వల్ల ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది.

ఎవరికి ఎంత ప్రోటీన్ అవసరం?

వయస్సును బట్టి పిల్లలకు అందాల్సిన ప్రోటీన్ పరిమాణం మారుతూ ఉంటుంది:

1 నుండి 3 ఏళ్లు: రోజుకు సుమారు 13 గ్రాములు.

4 నుండి 8 ఏళ్లు: రోజుకు 19 నుండి 20 గ్రాములు.

9 నుండి 13 ఏళ్లు: రోజుకు సుమారు 34 గ్రాములు.

ప్రోటీన్ లభించే సహజ వనరులు:

పిల్లల ఆహారంలో ఈ క్రింది వాటిని చేర్చాలని డాక్టర్ హిమాన్షు సూచిస్తున్నారు:

శాకాహారం: పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, పనీర్.

మాంసాహారం: గుడ్లు, చికెన్, చేపలు. వీటిలో నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది.

Tags: