Junk Food: జంక్ ఫుడ్ లాగిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
అయితే ఈ విషయం తెలుసుకోండి;
Junk Food:చాలా మంది జంక్ ఫుడ్ తింటుంటారు. చిటికేస్తే ఇంటికే తెచ్చి ఇచ్చే డెలివరీ యాప్స్ ఉండటం.. రకరకాల వెరైటీస్ బయట దొరకటం.. వెరసీ బయట తినే వారి సంఖ్య చాలా ఎక్కువ అయిపోతోంది. ఎంతో కొంత హెల్త్ కాన్షియస్ నెస్ ఉన్న వాళ్లు కూడా అప్పుడప్పుడు జంక్ తినక ఉండలేని పరిస్థితి ఉంది. అయితే జంక్ ఫుడ్ తింటే స్ట్రెస్ పెరుగుతుందని కొందరు నమ్ముతుంటారు. నిజంగా జంక్ ఫుడ్ తో స్ట్రెస్ పెరుగుతుందా.?
జంక్ ఫుడ్ లో షుగర్, సాల్ట్స్, ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వలన బాడీ హార్మోనల్ బ్యాలెన్స్ ను ప్రభావితం చేస్తుంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచడం, గట్ హెల్త్ పై ప్రభావం చూపిస్తాయి.జంక్ ఫుడ్ తినటం వలన మెదడు కొంతగా వాపుకు గురవుతుందట. దీంతో బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతినటంతో పాటు స్ట్రెస్ ను మేనేజ్ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందట. జంక్ ఫుడ్ వలన కార్టిసోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తో పాటు ఇన్సులిన్ విడుదలపై ప్రభావం చూపుతుంది. ఇది స్ట్రెస్, టెన్షన్స్ కు దారితీస్తుంది. జంక్ ఫుడ్ తినటం వలన శరీరానికి, మెదడుకు కావాల్సిన న్యూట్రిషియెంట్స్ అబ్సార్బ్ చేసుకోవడం మందగిస్తుంది. దీంతో మెగ్నీషియం, బి విటమిన్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, న్యూట్రిషియెంట్స్ అందటం తగ్గిపోతుంది.
జంక్ ఫుడ్ వలన నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవటం వలన యాంక్జైటీ, అలసట, ఇరిటేషన్, స్ట్రెస్ మొదలైనవి పెరుగుతాయి. ఇక రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఎమోషనల్ ఈటింగ్ పెరుతుందట.జంక్ ఫుడ్ లో యాంటీ యాక్సిడెంల్స్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచుతుందట. అలాగే డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుందట. డోపమైన్ ను ఫీల్ గుడ్ హార్మోన్ అంటుంటారు. డొపమైన్ అంచనాలకు మించిన రుచిని, సంతృప్తిని కోరుకుంటుంది. అది మిస్ అయితే ఏదో తెలియని ఆందోళన మొదలై దారుణమైన స్ట్రెస్ కు గురవుతామని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. జంక్ ఫుడ్ తగ్గించి ఫైబర్, మినరల్ రిచ్ ఫుడ్ తినటం వలన బాడీ బ్యాలెన్స్ డ్ గా ఉంటూస్ట్రెస్ నుంచి దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.