Deafness at 40: 40 ఏళ్లకే చెవుడు.. ? మీ ఇయర్‌ఫోన్ల వాడకంపై ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక..

మీ ఇయర్‌ఫోన్ల వాడకంపై ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక..

Update: 2026-03-04 12:12 GMT

Deafness at 40: ఒకప్పుడు వినికిడి లోపం అనేది కేవలం వృద్ధాప్య సమస్యగా ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు, ఇప్పుడు 40 ఏళ్ల లోపు వారికే వినికిడి శక్తి తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎయిమ్స్ ఈఎన్‌టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పూనమ్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. మన దైనందిన అలవాట్లే మన చెవుల పాలిట శత్రువులుగా మారుతున్నాయి.

చిన్న వయసులోనే వినికిడి తగ్గడానికి కారణాలు:

వృద్ధాప్యం కంటే ముందే వినికిడి శక్తి మందగించడానికి ప్రధాన కారణం టెక్నాలజీపై అతిగా ఆధారపడటమే.

అధిక వాల్యూమ్:

మొబైల్ లేదా ఇతర ఆడియో పరికరాల్లో 60 శాతం కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టి వినడం వల్ల వినికిడి కణాలు దెబ్బతింటాయి.

నిరంతర వాడకం:

రోజంతా ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను చెవుల్లోనే ఉంచుకోవడం వల్ల చెవి లోపలి భాగం ఒత్తిడికి గురవుతుంది.

శబ్ద కాలుష్యం:

పని ప్రదేశాల్లో లేదా బయట విపరీతమైన శబ్దాల మధ్య ఉండటం కూడా వినికిడి లోపానికి దారితీస్తుంది.

మీరు సరిగ్గా వినడం లేదని ఎలా గుర్తించాలి?

కింది లక్షణాలు కనిపిస్తే మీ వినికిడి సామర్థ్యం తగ్గుతోందని అర్థం:

1. సాధారణంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం.

2. జన సమూహం ఉన్న చోట లేదా రద్దీ ప్రదేశాల్లో పక్కన ఉన్న వారు చెప్పేది వినపడకపోవడం.

3. ఫోన్‌లో సంభాషించేటప్పుడు అవతలి వ్యక్తి మాటలు స్పష్టంగా లేకపోవడం.

4. చెవుల్లో నిరంతరం ఈలలు లేదా రింగింగ్ శబ్దం వరావడం.

చెవుల రక్షణ కోసం 60-60 నియమం

చెవులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వైద్యులు **వవవవవ60-60 రూల్ పాటించాలని సూచిస్తున్నారు..

60 శాతం వాల్యూమ్:.

మీరు వాడే పరికరాల్లో వాల్యూమ్ ఎప్పుడూ 60 శాతం కంటే తక్కువగానే ఉండాలి.

60 నిమిషాల పరిమితి:

గంట సేపు హెడ్‌ఫోన్‌లు వాడితే, కనీసం ఒక 60 నిమిషాల పాటు చెవులకు విశ్రాంతి ఇవ్వాలి.

వినికిడి లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, అది శాశ్వత చెవుడుకు దారితీసే ప్రమాదం ఉంది. చెవుల్లో స్వల్పంగా తేడా అనిపించినా వెంటనే నిపుణులను సంప్రదించాలి.

టెక్నాలజీని వాడుకోవాలి కానీ, అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. కొంచెం జాగ్రత్త వహిస్తే మీ వినికిడి శక్తిని పదిలపరుచుకోవచ్చు.

Tags:    

Similar News