Eat Banana and Papaya Together: అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
ఏమవుతుందో తెలుసా..?
Eat Banana and Papaya Together: అరటిపండు, బొప్పాయి.. రెండూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లు. ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువగా తినాలని సిఫార్సు చేస్తారు. అయితే ఆహార నిపుణులు, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం.. వేర్వేరు లక్షణాలు కలిగిన ఈ రెండు పండ్లను కలిపి తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కలయిక ఆరోగ్యానికి ఎందుకు హానికరం కావచ్చు అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెండు పండ్లలోని పోషక ప్రయోజనాలు
ఈ రెండు పండ్లు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి:
అరటిపండు: దీనిలో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, శక్తిని అందించడానికి సహాయపడుతుంది.
బొప్పాయి: దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రెండు పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి, కానీ వాటిని కలిపి తినడం వల్ల సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు.
అరటిపండు-బొప్పాయి కలియకతో వచ్చే సమస్యలు
అరటిపండు, బొప్పాయి వేర్వేరు లక్షణాలను కలిగి ఉన్న కారణంగా వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఈ కలయిక కారణంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు: వాంతులు, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
శ్వాసకోశ సమస్యలు: కొంతమందిలో ఈ పండ్ల కలయిక ఉబ్బరం, ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా ప్రేరేపించవచ్చు. శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకుండా ఉండటం మంచిది.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఆహారాల కలయిక జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అరటిపండు: ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది
బొప్పాయి: ఇది శరీరాన్ని వేడి చేస్తుంది
ఈ విధంగా విభిన్న గుణాలు కలిగిన పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఈ బలహీనత కారణంగా తలనొప్పి, వాంతులు, తలతిరగడం, అలెర్జీలు మరియు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
సమస్యలు తీవ్రం కాకుండా నిరోధించడానికి ఆహార నిపుణులు ఈ పండ్లను వేర్వేరు సమయాల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. అరటిపండు, బొప్పాయి రెండింటినీ విడివిడిగా, వేర్వేరు సమయాల్లో తింటే, అవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్ల కలయికను వీలైనంత వరకు తగ్గించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.