Eating Rice at Night: రాత్రిపూట అన్నం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Update: 2026-02-26 11:58 GMT

Eating Rice at Night: తెలుగువారి భోజనంలో అన్నం అంతర్భాగం. అయితే నేటి బిజీ జీవనశైలిలో చాలామంది రాత్రి 9 లేదా 10 గంటల తర్వాతే భోజనం చేస్తున్నారు. ఇలా రాత్రిపూట ఆలస్యంగా అన్నం తినడం వల్ల శరీరానికి ఎంతటి నష్టం కలుగుతుందో తాజా ఆరోగ్య నివేదికలు షాకింగ్ నిజాలను వెల్లడిస్తున్నాయి. అన్నం ప్రియులు తప్పక తెలుసుకోవాల్సిన ఆ విషయాలు ఇవే..

బరువు పెరగడానికి ప్రధాన కారణం

బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. కానీ రాత్రిపూట మనం శారీరక శ్రమ అస్సలు చేయం. దీనివల్ల బియ్యం ద్వారా వచ్చే కేలరీలు ఖర్చు కావు సదా.. అవి కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటాయి. రాత్రి నిద్రలో శరీర జీవక్రియ నెమ్మదించడం వల్ల ఈ కేలరీలను బర్న్ చేయడం కష్టమై బరువు పెరుగుతారు.

షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ఛాన్స్

తెల్ల బియ్యం హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. ప్రతిరోజూ రాత్రి అన్నం తినడం వల్ల కాలక్రమేణా టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్యలు

రాత్రి అన్నం తిన్న తర్వాత చాలామంది గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంగా ఉందని ఫిర్యాదు చేస్తుంటారు. బియ్యంలోని కార్బోహైడ్రేట్లు జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. సెన్సిటివ్ జీర్ణక్రియ ఉన్నవారికి రాత్రిపూట అన్నం తినడం వల్ల ఆమ్లత్వం పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది.

అన్నానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవే:

మల్టీగ్రెయిన్ రోటీ: ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.

క్వినోవా: ప్రోటీన్ అధికంగా ఉండే అత్యుత్తమ ఆహారం.

మిల్లెట్స్: ఇవి తేలికగా జీర్ణమవుతాయి మరియు కేలరీలు తక్కువ.

దాలియా : ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మూంగ్ దాల్ కిచిడి: పప్పులు, కూరగాయలతో చేసే కిచిడి అత్యంత బలవర్ధకమైన రాత్రి భోజనం.

Tags:    

Similar News