Sleep with Socks On: సాక్సులు వేసుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
ఏమవుతుందో తెలుసా?;
Sleep with Socks On: వర్షాకాలం, చలికాలంలో చాలామంది తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా పాదాలు చల్లగా మారకుండా రాత్రిపూట సాక్సులు వేసుకుని పడుకోవడం ఒక సాధారణ అలవాటు. అయితే సాక్సులు వేసుకుని పడుకోవడం మంచిదా లేక హానికరమా అనే అంశంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
సాక్సులు వేసుకుని పడుకోవడం అనేది వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కొందరు మంచి నిద్ర కోసం సాక్సులు ధరిస్తారు. మనం నిద్రపోయినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాంటి సమయంలో సాక్సులు వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే, పాదాల చర్మం గరుకుగా మారకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవడానికి కూడా సాక్సులు సహాయపడతాయి. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సాక్సులు ధరించడం వల్ల వెచ్చదనం లభిస్తుంది.
సాక్సులు ధరించడం వల్ల కలిగే నష్టాలు
సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానివల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక వేడి: ఉన్ని లేదా చాలా మందపాటి సాక్సులు ధరించి పడుకోవడం వల్ల శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల విశ్రాంతి లేకపోవడం, ఆందోళన, రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
శ్వాస ఇబ్బందులు: చాలా బిగుతుగా ఉండే సాక్సులు ధరించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. అంతేకాకుండా, ఇది శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కలిగించవచ్చు.
ఇన్ఫెక్షన్లు: రోజంతా ధరించిన సాక్సులతోనే రాత్రి పడుకుంటే, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా సాక్సులలో ఉండే చెమట, బ్యాక్టీరియా వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
రక్త ప్రసరణకు ఆటంకం: చాలా బిగుతుగా ఉన్న సాక్సులు పాదాలలోని రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. దీనివల్ల కాళ్ళకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడంతో ఆరోగ్య సమస్యలు రావచ్చు.
మొత్తంగా, సాక్సులు ధరించడం వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ, వీలైనంత వరకు వాటిని ధరించకుండా పడుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ధరించాలనుకుంటే వదులుగా ఉండే కాటన్ సాక్సులు ధరించడం ఉత్తమం.