Health: అన్న ప్రాశన ఎందుకు చేస్తారో తెలుసా.?
అన్న ప్రాశన...;
Health:ఈ రోజుల్లో చిన్న పిల్లలకు అన్నప్రాశన చేయడం సాధారణమై పోయింది. సాధారణంగా బిడ్డ ఆరు నెలల ఆరో రోజున ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. ఆ రోజు కుదరని వారు 6వ నుంచి 8వ నెల మధ్యలో మంచిరోజు చూసుకొని ఈ సంబరాన్ని చేసుకుంటారు. కొంతమంది ఆచారాల ప్రకారం మగ బిడ్డకు పురుషులకు 6వ నెలలో ,ఆడ బిడ్డకు 5వ నెల లేదా 7వ నెలలో కూడా చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ముహూర్తం చూసుకుని, పండితుల సలహాతో మంచి తిథి, నక్షత్రం చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు.
ఎందుకు చేయాలి?
బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి మొదటి ఆరునెలలు తల్లి పాలల్లో చాలా పోషకాలుంటాయి. ఆ వయస్సులో తల్లిపాలు శిశువుకు సరిపోతాయి. ఆ సమయంలో బయటి ఫుడ్ పెడితే ఘన పదార్దాలను పెడితే జీర్ణించుకొనే శక్తి ఉండదు. ఇక ఆరు నెలల తరువాత పొట్ట పెరడగంతో పాటు ఆకలి కూడా క్రమేణ పెరుగుతుంది. తల్లి పాల విషయానికొస్తే ఆరు నెలల తరువాత పోషకాలు క్రమేణ తగ్గుతాయి.. 6 నెలల తర్వాత శిశువు శరీరానికి మరిన్ని పోషకాల అవసరం ఉంటుంది. అందుకే సాధారణంగా అప్పటి నుంచి బిడ్డలకు ఘనాహారం పెడతారు. ఇది ఆరోగ్యపరంగా ముఖ్యమైనదే కాకుండా, సాంప్రదాయ పరంగా శుభ కార్యంగా భావిస్తారు.బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని ఆశిస్తూ బంధువుల మధ్య ఈ శుభకార్యాన్ని నిర్వహిస్తారు.