Healthy Brain: మెదడు చురుగ్గా ఉండాలంటే విటమిన్ B12 ఎందుకు అవసరమో తెలుసా?

ఎందుకు అవసరమో తెలుసా?

Update: 2026-07-22 07:34 GMT

Healthy Brain: శరీరానికి గుండె ఎంత ముఖ్యమో, మన ఆలోచనలను, స్పందనలను నియంత్రించే మెదడు అంతకంటే ముఖ్యం. శరీరం సరిగ్గా పనిచేయడానికి మదర్‌బోర్డ్ లాంటి ఈ మెదడు ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటారు.

మానసిక ఒత్తిడి, మతిమరుపు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే మెదడు ఆరోగ్యం అనగానే మనకు వ్యాయామం, సరైన నిద్ర మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, మెదడు పనితీరును నేరుగా ప్రభావితం చేసే విటమిన్ B12 పాత్రను చాలామంది విస్మరిస్తుంటారు. దీని ప్రాముఖ్యతపై ప్రముఖ నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ రామచంద్రన్ తెలిపిన విశేషాలు ఇవే

మెదడులో విటమిన్ B12 ఏం చేస్తుంది?

కరెంట్ వైరుపైన ప్లాస్టిక్ కోటింగ్ ఎలాగైతే ఉంటుందో, మన నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే రక్షణ పొర ఉంటుంది.

వేగవంతమైన సంకేతాలు:

విటమిన్ B12 ఈ మైలిన్ షీత్ పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల మెదడు నుంచి శరీర భాగాలకు సమాచారం చాలా వేగంగా, సరిగ్గా చేరుతుంది.

ఆక్సిజన్ సరఫరా:

శరీరంలో కొత్త ఎర్ర రక్తకణాలు తయారుకావడానికి, డీఎన్‌ఏ రూపకల్పనకు B12 అవసరం. ఈ రక్తకణాలే మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ను మోసుకెళ్తాయి.

లోపం ఏర్పడితే ఈ సంకేతాలు నెమ్మదించి మెదడు పనితీరు మందగిస్తుంది.

విటమిన్ B12 లోపించిందని తెలిపే లక్షణాలు

ఈ విటమిన్ లోపం లక్షణాలు ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా బయటపడతాయి

చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోవడం (మతిమరుపు).

ఏదైనా పనిపై ఏకాగ్రత నిలపలేకపోవడం మరియు గందరగోళానికి గురికావడం.

మూడ్ స్వింగ్స్.

చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం.

నిరంతరం తీవ్రమైన అలసట, బలహీనత.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

శాకాహారులు : B12 ఎక్కువగా మాంసాహారంలోనే దొరుకుతుంది కాబట్టి, పూర్తిగా వెజిటేరియన్, వీగన్ డైట్ పాటించేవారిలో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

వయోవృద్ధులు:

వయసు పెరిగే కొద్దీ శరీరం ఈ విటమిన్‌ను గ్రహించే శక్తి తగ్గుతుంది.

Tags:    

Similar News