Drinking Too Much Coconut Water: కొబ్బరి నీళ్లు అతిగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. అమృతం లాంటి నీరు కూడా విషంగా మారే ప్రమాదం..

అమృతం లాంటి నీరు కూడా విషంగా మారే ప్రమాదం..

Update: 2026-03-20 12:26 GMT

Drinking Too Much Coconut Water: ఎండలు ముదురుతున్నాయి. దాహం తీర్చుకోవడానికి, డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడానికి చాలామంది ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లను ఆశ్రయిస్తుంటారు. తక్షణ శక్తిని, తాజాదనాన్ని ఇవ్వడంలో కొబ్బరి నీళ్లకు సాటి లేదు. కానీ "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లుగా.. వీటిని అతిగా తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి కూడా కలగవచ్చని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

పొటాషియం పెరిగితే ప్రమాదమే..

కొబ్బరి నీళ్లలో పొటాషియం స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా సేవించడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు అసాధారణంగా పెరిగి, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే శరీరంలోని అదనపు పొటాషియంను బయటకు పంపే శక్తి కిడ్నీలకు లేకపోతే సమస్య మరింత జటిలమవుతుంది.

బీపీ మందులు వాడేవారు: రక్తపోటును తగ్గించుకోవడానికి మందులు వాడుతున్న వారు వీటిని అతిగా తాగితే, బీపీ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది.

మధుమేహ బాధితులు: ఇందులో ఉండే సహజ చక్కెరలు షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగానే తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకునే వారు:

కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిగా తాగడం వల్ల ఇందులోని కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి కారణం కావచ్చు.

జీర్ణక్రియపై ప్రభావం:

కొన్ని సందర్భాల్లో కొబ్బరి నీళ్లు అతిగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంత తాగడం సురక్షితం?

ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు కప్పులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతకంటే ఎక్కువ తాగితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కేవలం కొబ్బరి నీళ్లపైనే ఆధారపడకుండా వేసవిలో తగినంత మంచినీరు కూడా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏదైనా పరిమితంగా తీసుకున్నప్పుడే అది శరీరానికి మేలు చేస్తుంది. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగండి, కానీ మోతాదు మించకుండా చూసుకోండి..

Tags:    

Similar News