Drinking Water from Copper Vessel: రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా.? అయితే జాగ్రత్త

అయితే జాగ్రత్త

Update: 2026-04-01 12:56 GMT

Drinking Water from Copper Vessel: ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధతో మళ్ళీ పాత కాలపు అలవాట్లను పాటిస్తున్నారు. అందులో ముఖ్యంగా రాగి పాత్రల వాడకం బాగా పెరిగింది. అయితే.. రాగి పాత్రల్లో ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగు ,పాల పదార్థాలు: రాగి పాత్రలో పెరుగును అస్సలు ఉంచకూడదు. ఇలా చేసినట్లయితే పెరుగులోని గుణాలు రాగితో చర్య జరిపి వికారం, వాంతులు, విరేచనాలకు దారితీసే అవకాశం ఉంది.

సిట్రస్ ఫ్రూట్స్ , పచ్చళ్లు: నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ ఫ్రూట్స్ లేదా వాటితో చేసిన పచ్చళ్లను రాగి పాత్రల్లో పెడితే రసాయన చర్య (Chemical Reaction) జరుగుతుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

మంచినీటి నిల్వ: రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడం మంచిదే కానీ దానికి కూడా ఒక కాలపరిమితి ఉంది. కేవలం 8 నుండి 12 గంటల పాటు ఉంచిన నీటిని మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం నిల్వ ఉంటే రాగి మోతాదు పెరిగి అనారోగ్యానికి దారితీయవచ్చు.

Tags:    

Similar News