Eating After 9 PM Every Day: డైలీ రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా.?

తింటున్నారా.?

Update: 2026-04-02 06:19 GMT

Eating After 9 PM Every Day: రాత్రిపూట ఆలస్యంగా (ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత) భోజనం చేయడం వల్ల శరీరంలో జరిగే ప్రతికూల మార్పుల గురించి వైద్యులు , ఆరోగ్య నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు .రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏకంగా 40 శాతం వరకు తగ్గుతుందట. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా, మీరు తిన్న ఆహారం శక్తిగా మారడానికి బదులు.. నేరుగా కొవ్వు (Fat) రూపంలో శరీరంలో పేరుకుపోతుంది.

ముఖ్యంగా డయాబెటిస్ , ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారికి ఈ అలవాటు మరింత ప్రమాదకరం. ఇది కేవలం బరువు పెరగడానికే కాదు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. రాత్రి 8 గంటల లోపే మీ భోజనాన్ని ముగించండి. ఇలా చేయడం వల్ల నిద్ర నాణ్యత (Sleep Quality) పెరగడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎంతో దోహదపడుతుంది.

రాత్రిపూట తక్కువ కేలరీలు ఉన్న ఆహారం, సులభంగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా, నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే భోజనం చేయడం ఉత్తమం.భోజనం తర్వాత 5-10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం లేదా చిన్నపాటి నడక వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం.

Tags:    

Similar News