Feel Dizzy When You Suddenly Stand Up: పడుకుని ఉన్నప్పుడు లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉన్నప్పుడు ఒక్కసారిగా పైకి లేస్తే కళ్లు బైర్లు కమ్మడం, కాసేపు తల తిరిగినట్లు అనిపించడం చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. కొద్ది సెకన్ల తర్వాత అంతా సాధారణ స్థితికి వచ్చేస్తుంది కాబట్టి చాలామంది దీనిని పెద్ద విషయంగా పట్టించుకోరు. అయితే వైద్య పరిభాషలో దీనిని ఆర్థోస్టాటిక్ లేదా పోస్ట్యురల్ హైపోటెన్షన్ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

శరీరంలో అసలేం జరుగుతుంది?

మనం పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు గుండెకు, మెదడుకు సమానమైన రక్తప్రసరణ జరుగుతుంది. కానీ ఒక్కసారిగా పైకి లేవగానే గురుత్వాకర్షణ ప్రభావం వల్ల రక్తమంతా శరీరం కింది భాగానికి (కాళ్లు, చేరుతుంది.

దీనివల్ల రక్తపోటు (Blood క్షణాల్లో అకస్మాత్తుగా పడిపోతుంది. మెదడుకు చేరే ఆక్సిజన్, రక్తం పరిమాణం స్వల్ప కాలానికి తగ్గుతుంది. ఫలితంగా కళ్లు తిరగడం, తల తేలికైపోయినట్లు అనిపించడం, కళ్లముందు చీకట్లు కమ్మడం జరుగుతుంది. సాధారణంగా మన శరీరంలోని నాడీ వ్యవస్థ వెంటనే స్పందించి గుండె వేగాన్ని పెంచి, రక్తనాళాలను కుదించి బీపీని సెట్ చేస్తుంది. అయితే కొందరిలో ఈ ప్రతిస్పందన ఆలస్యమైనప్పుడు ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది.

తల తిరగడానికి ప్రధాన కారణాలు:

హైడ్రేషన్ : శరీరంలో తగినంత ద్రవాలు లేనప్పుడు రక్త పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల నిలబడగానే రక్తపోటు వేగంగా పడిపోతుంది.

రక్తహీనత: శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ లోపం ఉన్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ చేరడం మందగించి సులభంగా కళ్లు తిరుగుతాయి.

మందుల దుష్ప్రభావం: బీపీ నియంత్రణ మందులు, మూత్రవిసర్జనను పెంచే మందులు, కొన్ని రకాల డిప్రెషన్ మందులు వాడుతున్న వారిలో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది.

గుండె సంబంధిత సమస్యలు: గుండె స్పందనల వేగంలో హెచ్చుతగ్గులు లేదా గుండె కవాటాల సమస్యలు ఉన్నప్పుడు శరీరానికి రక్త సరఫరా సమర్థవంతంగా జరగదు.

విటమిన్ లోపాలు:

ముఖ్యంగా విటమిన్ B12 లోపం వల్ల నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయక సమతుల్యత దెబ్బతింటుంది.

ఎక్కువ సమయం బెడ్ రెస్ట్:* ఎక్కువ రోజులు మంచానికే పరిమితమైన రోగులు ఒక్కసారిగా లేచి నడవడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

నిదానంగా లేవాలి:

మంచంపై నుంచి లేచేటప్పుడు హడావుడిగా ఒక్కసారిగా లేవకూడదు. మొదట పక్కకు తిరిగి, కాసేపు కూర్చొని ఆ తర్వాతే నెమ్మదిగా నిలబడాలి.

తగినంత నీరు తాగాలి:

రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు, ఓఆర్ఎస్ లేదా పండ్ల రసాలు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి.

కాళ్లకు వ్యాయామం: నిలబడే ముందు కూర్చున్న స్థితిలోనే కాళ్లను, పాదాలను కాసేపు కదిలించడం వల్ల కింది భాగంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.

కాళ్లపై కాళ్లు వేసుకుని ఎక్కువసేపు కూర్చోవద్దు: ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

> అప్పుడప్పుడు కొద్ది సెకన్ల పాటు తల తిరిగితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ రోజూ తరచూ ఇలాగే జరుగుతున్నా, కళ్లు తిరిగి కింద పడిపోతున్నా (మూర్ఛ), ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్తపోటు, ఈసీజీ, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

Tags: