Feeling Bloated After Meals: భోజనం చేయగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా? అయితే చాలా మంది వెంటనే గోధుమల్లో ఉండే 'గ్లూటెన్' లేదా పాలలో ఉండే 'డైరీ' ఉత్పత్తులను పూర్తిగా మానేస్తుంటారు. కానీ, నిపుణులు మాత్రం ఇలా గుడ్డిగా ఆహారాన్ని కట్ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.

మనం తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయినా, లేదా జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉన్నా ఉబ్బరం వస్తుంది. దీనికి అసలు కారణం గ్లూటెన్ కాకపోవచ్చు. కేవలం సోషల్ మీడియాలో చూసి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా డైట్ మార్చడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు కూడా దూరమవుతాయి. అసలు ఉబ్బరానికి అసలు కారణాలు వేరే ఉండొచ్చు

ముఖ్యంగా గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత, ఒత్తిడిలో ఉండగా వేగంగా ఆహారం తినడం, లేదా కడుపులో తగినంత జీర్ణ రసాలు ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, చిన్న ప్రేగుల్లో బ్యాక్టీరియా అతిగా పెరగడం (SIBO) లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆహారంతో సంబంధం లేకుండా ఉబ్బరం వేధిస్తుంది.

కాబట్టి, ఏవో కొన్ని పదార్థాలను బ్లైండ్‌గా పక్కన పెట్టే బదులు... మీరు ఏది తిన్నప్పుడు సమస్య వస్తుందో గమనించడం, ఆహారాన్ని మెల్లగా నమిలి తినడం మరియు అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం తొందరపాటు నిర్ణయాలు కాకుండా, సరైన అవగాహన పెంచుకోవడం ఎప్పుడూ మంచిది.

Tags: