Frequent Sneezing: తుమ్ములు రావడానికి కారణాలివే..?

కారణాలివే..?;

Update: 2025-07-25 06:12 GMT

Frequent Sneezing:  తుమ్ములు రావడం సహజం కానీ..కొంత పదే పదే తుమ్ములు వస్తాయి. దీనికి కారాణాలు చాలానే ఉంటాయి. అయితే తరచూ తుమ్ములు వస్తే అనారోగ్యానికి సిగ్నల్ ఇస్తున్నట్లు చెప్పవచ్చు.తుమ్ములు ఎందుకు వస్తాయి. వాటికి కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.

తుమ్ములకు ప్రధాన కారణాలు

దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు, లేదా బూజు వంటి వాటికి మీ శరీరం అతిగా స్పందించినప్పుడు అలర్జీ వస్తుంది. దీంతో తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు దురద పెట్టడం వంటివి జరుగుతాయి.

వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా తుమ్ములు వస్తాయి. జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు ముక్కులో చికాకు కలిగి తుమ్ములు వస్తాయి.

గాలిలో ఉండే దుమ్ము కణాలు, పొగ, లేదా ఇతర కాలుష్య కారకాలు ముక్కులోకి వెళ్లి చికాకు కలిగించినప్పుడు తుమ్ములు వస్తాయి.

చల్లని గాలి లేదా వేడి గాలికి ఒక్కసారిగా మారినప్పుడు కొంతమందికి తుమ్ములు వస్తాయి.

ఇది అలర్జీ కాకపోయినా, అలర్జీ లక్షణాలను పోలి ఉంటుంది. కొన్ని సువాసనలు (పెర్ఫ్యూమ్‌లు), బలమైన వాసనలు, లేదా వాతావరణ మార్పులు దీనికి కారణం కావచ్చు.

ఒత్తిడి: అరుదుగా, తీవ్రమైన ఒత్తిడి కూడా కొంతమందిలో తుమ్ములకు కారణం కావచ్చు.

కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా తుమ్ములు రావొచ్చు.

కొంతమందికి అకస్మాత్తుగా తీవ్రమైన వెలుతురు చూసినప్పుడు తుమ్ములు వస్తాయి. దీనిని ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్ (Photic Sneeze Reflex) అంటారు. 

Tags:    

Similar News