Global Concern Over Ebola: ప్రపంచవ్యాప్తంగా ఎబోలా గుబులు.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 7 తొలి లక్షణాలు ఇవే..

అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 7 తొలి లక్షణాలు ఇవే..

Update: 2026-05-25 06:59 GMT

Global Concern Over Ebola: ఆఫ్రికా దేశాలలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలలో ఎబోలా బుండిబుగ్యో స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు అత్యంత కీలకమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప భారతీయులెవరూ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు భారతదేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కానప్పటికీ, విమానాశ్రయాలలో 24/7 థర్మల్ స్క్రీనింగ్, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో ఎబోలా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎబోలా వైరస్ యొక్క 7 తొలి లక్షణాలు:

ఎబోలా వైరస్ సోకినప్పుడు ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం లాగే ఉంటాయి. దీనివల్ల చాలా మంది దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి:

తీవ్రమైన, హఠాత్తుగా వచ్చే అధిక జ్వరం

భరించలేని తలనొప్పి

కండరాలు, ఒంటి నొప్పులు

తీవ్రమైన నీరసం, విపరీతమైన అలసట

గొంతు నొప్పి మరియు వాపు

వాంతులు, విరేచనాలు

తీవ్రమైన కడుపు నొప్పి

అత్యంత ప్రమాదకర దశ:

ఈ ఇన్ఫెక్షన్ ముదిరి తీవ్రరూపం దాల్చితే.. వైరస్ శరీరంలోని రక్తనాళాలపై దాడి చేస్తుంది. దీనివల్ల బాధితుడికి కళ్లు, ముక్కు, చిగుళ్లు లేదా శరీరం లోపలి అవయవాల నుండి రక్తస్రావం జరగవచ్చు. ఈ దశకు చేరితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

ఎబోలా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

ఎబోలా అనేది గాలి ద్వారా వ్యాపించే జబ్బు కాదు. ఇది ప్రధానంగా..

సోకిన వ్యక్తి యొక్క రక్తం, లాలాజలం, చెమట, వాంతులు లేదా శరీర ద్రవాలను నేరుగా తాకడం వల్ల వ్యాపిస్తుంది.

సరైన పిపిఇ కిట్లు, మాస్కులు లేకుండా రోగికి సేవలు అందించే హెల్త్‌కేర్ వర్కర్లకు ఇది సులభంగా సంక్రమిస్తుంది.

ఎబోలా సోకిన జంతువులను తాకడం లేదా వాటి మాంసం తినడం వల్ల కూడా వస్తుంది.

WHO, నిపుణులు సూచిస్తున్న నివారణ చిట్కాలు..

ప్రస్తుతం ఆఫ్రికాలో విజృంభిస్తున్న బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్‌కు ఎటువంటి అధికారిక వ్యాక్సిన్ కానీ, నిర్దిష్ట చికిత్స కానీ అందుబాటులో లేదు. అందుకే భయం కన్నా ముందస్తు జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి..

చేతుల పరిశుభ్రత:

క్రమం తప్పకుండా సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించాలి.

దూరంగా ఉండటం:

వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులకు, విదేశాల నుండి వచ్చి జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.

ఐసోలేషన్:

ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు కనీసం 21 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని నిశితంగా గమనించుకోవాలి. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే తమ ట్రావెల్ హిస్టరీని వైద్యులకు చెప్పి, ప్రత్యేక గదిలో ఉండి చికిత్స పొందాలి.

రక్షణ కవచాలు:

ఆసుపత్రులలో లేదా రోగుల వద్ద ఉండాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు, చేతి తొడుగులు ధరించాలి.

Tags:    

Similar News