Hair Fall and Skin Issues: నేటి కాలంలో ఒత్తైన జుట్టు, కాంతివంతమైన చర్మం అందరి కల. దీనికోసం వేల రూపాయలు ఖర్చు చేసి రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే మన ఇంటి పెరట్లోనే ఉండే కలబంద ఒక అద్భుతమైన సహజ సౌందర్య సాధనమని మీకు తెలుసా? ఇందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సంజీవనిలా పనిచేస్తాయి.

చర్మ సంరక్షణలో కలబంద మ్యాజిక్:

మొటిమలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడే వారికి కలబంద ఒక ఉత్తమ పరిష్కారం.

వాడే విధానం: కలబంద ఆకులోని పచ్చని పొట్టు తీసి, లోపల ఉండే తెల్లటి గుజ్జును ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

మచ్చల నివారణ: కలబంద జెల్‌లో ఒక చుక్క లావెండర్ నూనె కలిపి రాస్తే దెబ్బతిన్న చర్మ కణాలు త్వరగా కోలుకుంటాయి.

పొడి చర్మం: డ్రై స్కిన్ ఉన్నవారు కలబంద జెల్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది.

జుట్టు సమస్యలకు చెక్:

కలబందలో 95% కంటే ఎక్కువ నీరు ఉండటం వల్ల ఇది జుట్టుకు కావాల్సిన తేమను, చల్లదనాన్ని అందిస్తుంది.

చుండ్రు నివారణ: కలబంద జెల్‌ను నేరుగా తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే తల దురద తగ్గి, చుండ్రు మాయమవుతుంది.

నేచురల్ కండీషనర్: కలబంద జెల్‌ను ఆముదం లేదా కొబ్బరి నూనెతో కలిపి హెయిర్ మాస్క్‌గా వేసుకుంటే జుట్టు సిల్కీగా మారుతుంది. ఇది సహజమైన కండీషనర్‌గా పనిచేసి జుట్టు కుదుళ్లను దృఢపరుస్తుంది.

ఎందుకు వాడాలి?

మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కానీ కలబంద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

అందానికి ఖరీదైన క్రీములు అక్కర్లేదు, ప్రకృతి ఇచ్చిన కలబందను సరైన పద్ధతిలో వాడితే చాలు. మెరిసే చర్మం, మిలమిలలాడే జుట్టు మీ సొంతమవుతాయి!

Tags: