Higher Risk of Lupus in Women: మహిళల్లో అధికంగా 'లూపస్' ముప్పు: లక్షణాలు ఇవే!

లక్షణాలు ఇవే!

Update: 2026-02-18 13:47 GMT

Higher Risk of Lupus in Women: ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లోనూ ప్రాణాంతకమైన వ్యాధులు దాగి ఉండవచ్చు అనడానికి 'లూపస్' (Lupus) ఒక ప్రధాన ఉదాహరణ. ఇది ఒక ప్రమాదకరమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. సాధారణంగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బయటి నుంచి వచ్చే హానికారక క్రిములపై దాడి చేయాలి. కానీ, ఈ వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పి, మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలానికే, హానికారక క్రిములకు మధ్య తేడాను గుర్తించలేదు. ఫలితంగా, సొంత కణజాలంపైనే యాంటీబాడీలు దాడి చేస్తాయి.

లూపస్ వ్యాధి బారిన పడే వారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న వయసులో (Reproductive Age) దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. స్త్రీ హార్మోన్లు ఈ సమయంలో చాలా చురుకుగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు బయటకు ఆరోగ్యంగానే కనిపిస్తారు, కానీ లోలోపల అవయవాలు దెబ్బతింటుంటాయి.

గుర్తించాల్సిన లక్షణాలు:

ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే జబ్బు నిర్ధరణ అయ్యే లోపే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది.

విపరీతమైన నిస్సత్తువ (అలసట)

తరచూ వచ్చే జ్వరం

నోట్లో పుండ్లు ఏర్పడటం

చర్మంపై దద్దుర్లు (ముఖ్యంగా ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రటి మచ్చలు)

వ్యాధి నిర్ధారణ పరీక్షలు:

వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని ప్రత్యేకమైన రక్త పరీక్షలను సూచిస్తారు:

న్యూక్లియర్ యాంటీబాడీ (ANA) పరీక్ష

డబుల్ స్ట్రాండ్ DNA (dsDNA)

రక్తంలో C3, C4 ప్రొటీన్ల స్థాయిలు

యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ పరీక్ష

పైన పేర్కొన్న పరీక్షల ఫలితాలను బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. లూపస్ బాధితులు ఆందోళన చెందాల్సిన పనిలేదు; వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే ఎటువంటి ప్రమాదం లేకుండా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. సరైన జీవనశైలి మరియు నిరంతర పర్యవేక్షణ ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి కీలకం.

Tags:    

Similar News