Damodara Rajanarsimha : వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి సెలవులు రద్దు

ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ టెలికాన్ఫరెన్స్‌;

Update: 2025-08-13 04:33 GMT

వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి భారీ వర్షాల కారణంగా ఎటువంటి అంటు రోగాలు ప్రబల కుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యా, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రుల సూరింటెండెంట్లు, ఆర్‌ఎంఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, డాక్టరలు, సిబ్బంది ఈ మూడు రోజులు ఖచ్చితంగా హాస్పిటళ్ళలోనే ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖలో సిబ్బంది అందరి సెలవులు రద్దు చేయాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్ధితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డెలివరీ డేట్‌ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్‌లోనే బర్త్‌ వెయిటింగ్‌ రూములకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో సేవలందించాలన్నారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్దంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే అంబులెన్స్‌ వెళ్ళి పేషెంటును ఆసుపత్రికి తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే హాస్పిటళ్ళలో విద్యుత్‌ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పవర్‌ కట్‌ అయిన మరుక్షణమే జనరేటర్లు ప్రారంభించి రోగులకు ఇబ్బది కలగకుండా చూసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్లకు మంత్రి సూచించారు. ప్రతి ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హాస్పిటల్స్‌లోకి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ ఈ ముడు రోజులు క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News