Hot Water and Banana in the Morning: ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే మనలో చాలామంది టీ లేదా కాఫీతో దినచర్యను ప్రారంభిస్తుంటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో పాటు ఒక అరటిపండును తీసుకుంటే మీ శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సింపుల్ కాంబినేషన్ మన బాడీకి ఎంతలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండులో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, పొటాషియం,డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి రోజంతా సరిపడా శక్తిని తక్షణమే అందిస్తుంది. అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య దరిచేరదు. అంతేకాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ మార్గమని చెప్పవచ్చు. అరటిపండు తినడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది కాబట్టి, పదే పదే ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. అలాగే జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచడంలో వేడి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండటానికి ఈ చిన్న అలవాటు ఎంతో సహాయపడుతుంది.

Tags: