Soak Different Pulses: మన భారతీయ వంటగదిలో పప్పులు, ధాన్యాలు లేని రోజంటూ ఉండదు కదా! రోజూ మనం రకరకాల పప్పులతో రుచికరమైన వంటకాలు చేసుకుంటాం. అయితే, వంట చేసే ముందు పప్పులను కచ్చితంగా నానబెట్టాలని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలనే దానిపై మీకు స్పష్టత ఉందా? అన్ని పప్పులకూ ఒకే నానబెట్టే సమయం సరిపోతుందనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం.. పప్పులను నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడకడమే కాకుండా, వాటిలో ఉండే యాంటీ-న్యూట్రియంట్స్ కూడా తగ్గుతాయి. అయితే, ఈ నానబెట్టే సమయం పూర్తిగా ఆయా పప్పుల పరిమాణం, గట్టిదనం మీద ఆధారపడి ఉంటుంది!

మొదటగా.. చిన్నగా, రెండుగా చీల్చిన పప్పుల గురించి చూద్దాం. పెసరపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు లేదా మసూర్ పప్పు.. ఇవి చాలా త్వరగా నీటిని పీల్చుకుంటాయి. కాబట్టి వీటిని వంట చేయడానికి ముందు కేవలం 15 నుండి 30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది!

ఇక రెండోది.. శనగపప్పు (Chana Dal) పొట్టుతో ఉండే హోల్ మసూర్ పప్పు. ఇవి కొంచెం పెద్దవిగా లేదా గట్టిగా ఉంటాయి కాబట్టి, నీటిలో బాగా నాననివ్వడానికి 2 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఇక చివరగా.. చాలా గట్టిగా ఉండే పెద్ద ధాన్యాల సంగతి చూద్దాం! పొట్టు మినపప్పు, పొట్టు పెసలు , బ్లాక్ చనా (Kala Chana), కాబూలీ చనా , రాజ్మా (Rajma).. ఇవన్నీ సైజులో పెద్దవిగా చాలా సాంద్రత కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని కనీసం 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా (Overnight) నానబెట్టడం చాలా ముఖ్యం!

Tags: