Ignoring a Sore Throat: గొంతు నొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా..? అది ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు

అది ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు

Update: 2026-02-04 13:54 GMT

Ignoring a Sore Throat: గొంతులో గిరగిర.. మింగేటప్పుడు నొప్పి.. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్యే. అయితే చాలామంది దీనిని సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం గొంతు నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా లోపల దాగి ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు.

ఎందుకు వస్తుంది ఈ సమస్య?

గొంతు నొప్పి లేదా దురద రావడానికి రకరకాల కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.

విపరీతమైన కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ.

అతి చల్లని లేదా అతి వేడి వస్తువులను తీసుకోవడం.

చాలా బిగ్గరగా మాట్లాడటం లేదా తరచుగా అరవడం వల్ల గొంతు కణజాలం దెబ్బతినడం.

సాధారణంగా గొంతు నొప్పి 3 నుండి 7 రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి.

నిపుణుల మాట: ఇది వ్యాధి లక్షణమా?

గొంతు నొప్పి అనేది ఒక తీవ్రమైన అనారోగ్యం కాకపోవచ్చు కానీ, అది శరీరంలో ఉన్న ఇతర సమస్యలకు ఒక ముఖ్యమైన సూచిక అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోనోన్యూక్లియోసిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరానికి గొంతు నొప్పే మొదటి సంకేతం. మింగడంలో ఇబ్బంది, మెడ వాపు, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్ఫెక్షన్ తీవ్రతకు నిదర్శనం" అని తెలిపారు.

నివారణ మార్గాలు: మీరు చేయవలసినవి ఇవే

గొంతు నొప్పి దరిచేరకుండా ఉండాలంటే కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు:

పరిశుభ్రత: చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా వైరస్ శరీరంలోకి చేరకుండా ఉంటుంది.

దూరంగా ఉండండి: దుమ్ము, పొగ, ధూమపానానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

ఆహారం: సమతుల్యమైన ప్రోటీన్ ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నీరు: గొంతు తేమగా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగాలి.

నియంత్రణ: గొంతుపై ఒత్తిడి పడకుండా చాలా బిగ్గరగా మాట్లాడటం తగ్గించాలి.

Tags:    

Similar News